Serial Actor Chandu: గత ఐదేళ్లుగా ఇంటికి రాలేదు.. మమ్మల్ని చూడలేదు: చందు తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial Actor Chandrakanth Father Press Meet: గత ఐదేళ్లుగా తన కుమారుడు ఇంటికి రాలేదని బుల్లితెర నటుడు చందు (చంద్రకాంత్) తండ్రి చెన్న వెంకటేశ్ తెలిపారు. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, బార్య పిల్లల్ని వదిలేశాడన్నారు. పవిత్ర చనిపోయిన తర్వాత చందు డిప్రెషన్లోకి వెళ్లాడని వెంకటేశ్ చెప్పారు. పవిత్ర మరణం అనంతరం డిప్రెషన్లోకి వెళ్లిన చందు.. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ మణికొండలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.
చందు తండ్రి చెన్న వెంకటేశ్ మాట్లాడుతూ… ‘పవిత్రతో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, భార్య-పిల్లల్ని వదిలేశాడు. గత ఐదేళ్లుగా చందు మా ఇంటికి రాలేదు. మమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్లాడు. మూడు రోజుల క్రితం చందు మా ఇంటికి వచ్చాడు. పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నా అని చెప్పాడు. ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దని చెప్పాం. అందరం కౌన్సిలింగ్ ఇచ్చాం. నిన్న పొద్దున లక్డికపూల్ వెళ్లి వస్తా అని చెప్పి.. వెళ్లిపోయాడు. కాల్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మాకు తెలిసిన వ్యక్తిని చందు ఫ్లాట్‌కి పంపించాము. డోర్ పగలగొట్టి చూస్తే బాల్కనీలో సూసైడ్ చేసుకొని వేలడుతూ ఉన్నాడు. మేము వెళ్లేసరికి పోలీసులు వచ్చారు. పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తీసుకెళ్లారు’ అని అన్నారు.
Also Read
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్!
చందుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సమస్యల కారణంగా వారికి అతడు దూరంగా ఉంటున్నారు. ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్రతో కలిసి ఆయన బెంగళూరు నుంచి కారులో వస్తుండగా.. మహబూబ్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చండుకు గాయాలయ్యాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రి చెన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!