NTV Telugu Site icon

NED vs BAN: ప్రపంచకప్లో సంచలన విజయం.. బంగ్లాదేశ్పై నెదర్లాండ్స్ గెలుపు

Ned Won

Ned Won

వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్ మరో సంచలన విజయం సాధించింది. ఇంతకుముందు సౌతాఫ్రికాను ఓడించి రికార్డ్ సాధించిన.. డచ్ జట్టు, తాజాగా బంగ్లాను ఓడించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 230 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 142 పరుగులకు ఆలౌట్ అయింది. నెదర్లాండ్స్ బ్యాటింగ్ లో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 68 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అటు బౌలింగ్ లో పాల్ వాన్ మీకెరెన్ 4 వికెట్లు సాధించి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో నెదర్లాండ్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. తాజా ఓటమితో బంగ్లాదేశ్ 9వ స్థానానికి పడిపోయింది.

Onion Export: ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు..

బంగ్లాదేశ్‌ బ్యాటింగ్ లో ఓపెనర్ల నుంచి మొదలుపెడితే అందరూ బ్యాట్స్ మెన్స్ నిరాశపరిచారు. ఓపెనర్ లిటన్ దాస్ 3 పరుగులకే ఔట్ కాగా.. ఆ తర్వాత తంజీద్ హసన్ 15 పరుగులకు ఔటయ్యాడు. మెహదీ హసన్ మిరాజ్ 35 పరుగులు చేసి కాస్త.. స్కోరును పెంచినా, నెదర్లాండ్స్ బౌలింగ్ తో బంగ్లా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. అటు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా 5 పరుగులే పెవిలియన్ బాటపట్టాడు. ముష్ఫికర్ రహీమ్ 1, మెహదీ హసన్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు.

Bhatti Vikramarka: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం.. ఈ యుద్ధంలో ప్రజలే గెలవాలి

ఇక నెదర్లాండ్స్ బ్యాటింగ్ లో కెప్టెన్ ఎడ్వర్డ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 89 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ 3 పరుగులకే ఔట్ కాగా.. మాక్స్ ఓడౌడ్ డకౌట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బరేసి 41 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇంగ్లెబ్రెచ్ట్ 61 బంతుల్లో 35 పరుగులు చేశాడు. వాన్ బీక్ 16 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆర్యన్ దత్ 9 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక బంగ్లాదేశ్‌ బౌలింగ్ లో ముస్తాఫిజుర్‌ రెహమాన్‌.. 10 ఓవర్లలో 36 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మెహదీ హసన్ 7 ఓవర్లలో 40 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇస్లాం 10 ఓవర్లలో 51 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్ 9 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ అల్ హాసన్ ఒక వికెట్ పడగొట్టాడు.