Site icon NTV Telugu

Saroor Nagar Husband M*urder case: సరూర్ నగర్ భర్త హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. డంబెల్స్ తో మోది..

Husband

Husband

సరూర్ నగర్ భర్త హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త శేఖర్(40) ని తన భార్య డంబెల్స్ తో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త శేఖర్ నిద్రిస్తున్న సమయంలో భార్య చిట్టి డంబెల్స్ తో మోదగా, ప్రియుడు హరీష్ గొంతు నులిమి హత్యకు పాల్పడ్డారు. కొద్దీ రోజుల క్రితమే భార్య చిట్టికి హరీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. శేఖర్,చిట్టీలకు కూతురు,కుమారుడు పిల్లలున్నారు. వివాహేతర సంబంధంపై భార్య చిట్టిని భర్త శేఖర్ మందలించాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకునేందుకు హత్యకు ప్లాన్ చేసింది.

Also Read:Russia: రష్యా గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

భర్త శేఖర్ రాత్రి నిద్రిస్తున్న సమయంలో పిల్లలు ఇంట్లో లేని సమయంలో భార్య చిట్టి ప్రియుడికి కాల్ చేసి రప్పించింది. నిద్రలో ఉన్న శేఖర్ ను గొంతు నులిమి చంపుతుండగా ప్రతిఘటించాడు.. విషయం తెలిసిపోతుందని భావించిన భార్య చిట్టి వెంటనే భర్తలపై డంబుల్స్ తో మోదింది. దీంతో భర్త శేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. హత్య సమయంలో కుమార్తె ప్రభుత్వ హాస్టల్ లో ఉంటుండగా, కుమారుడిని గణేష్ మండపం వద్ద పడుకోబెట్టినట్లు తెలిపారు.. భర్త శేఖర్ చనిపోయడని నిర్దారించుకున్న తర్వాత ప్రియుడు ఘటన స్థలం నుండి వెళ్ళిపోయాడు.. ఉదయం డయల్ 100కు కాల్ చేసిన భార్య చిట్టి.. తన భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి నిద్రపోయాడని, ఉదయం చూస్తే చనిపోయి ఉన్నాడని పోలీసులకు తెలిపింది.

Also Read:Off The Record : టీడీపీ వర్సెస్ జనసేన పోయి.. జనసేన వర్సెస్ జనసేన

పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి, చిట్టి తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు చిట్టి బయటపెట్టడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.. నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్‌ (40)కు చిట్టి (33)తో 2009లో వివాహం జరిగింది. శేఖర్ కారు డ్రైవింగ్, చిట్టి బట్టల షాపులో పని చేస్తుంది.. శేఖర్ చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు.. పోలీసులు ఉస్మానియాకు శేఖర్ మృతుదేహాన్ని తరలించారు.. ఇవ్వాళ పోస్టుమార్టం పూర్తికానున్నట్లు తెలిపారు.

Exit mobile version