Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రమాణం చేశారు. కర్ణాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సిద్ధరామయ్యతోపాటు మరో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సిద్ధరామయ్య ఆరాష్ట్ర 24వ ముఖ్యమంత్రి.
Read Also:AC Side Effects: ఎండ ఎక్కువగా ఉందని ఏసీలో కూర్చుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో జి. పరమేశ్వర్ (ఎస్సీ), కేహెచ్ మునియప్ప (ఎస్సీ), కేజే జార్జ్ (మైనార్టీ – క్రిస్టియన్), ఎంబీ పాటిల్ (లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్టీ – వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ), రామలింగారెడ్డి (రెడ్డి), బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ (మైనార్టీ -ముస్లీం)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు
Read Also:Karnataka CM Oath Ceremony LIVE: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం.. ప్రత్యక్షప్రసారం
ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాలనుంచి సీఎంలు హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌లు హాజరుకాగా, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు హాజరయ్యారు. ఈ వేదికపైనే కమల్‌హాసన్ కూడా కనిపించారు. కంఠీరవ స్టేడియం వేదికగా జరిగిన సిద్ధరామయ్య, డీకేశివకుమార్‌ల ప్రమాణస్వీకారంకు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.