Bandla Ganesh Wearing Slippers In Ayyappa Deeksha while burning crackers: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా స్టార్. ఆయనలా ఎంతో మంది ఫేమస్ అయిన నటీనటులు, నిర్మాతలు ఉన్నా బండ్ల రూటే సెపరేటు. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా సినిమాలు మానేసిన ఆయన అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఆయన రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయ్యాడు. గతంలో కాంగ్రెస్ లో చేరి, ఆ తరువాత దూరమై సైలెంట్ అయినా ఇప్పుడు ఎన్నికల ముంగిట మళ్ళీ కాంగ్రెస్ పాట పాడుతున్నారు. ఇక దీపావళి పండుగ సమయంలో బండ్ల గణేష్ ఇంట క్రాకర్స్ ఫోటో కూడా చాలా ఫేమస్. బండ్లన్న కొన్న టపాసులు అన్ని నేలపై అందంగా పరిచి వాటితో ఒక ఫోటో దిగి బండ్ల గణేష్ ప్రతి ఏడాది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హాట్ టాపిక్ అవుతూ ఉంటాడు. ఈ సారి కూడా గట్టిగానే క్రాకర్స్ కొని వాటితో తన తండ్రి, కుమారులతో ఫోటో దిగి పోస్ట్ చేశారు.
800 Movie : ఓటీటీ లోకి రాబోతున్న ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’..
ఇక ఇదే క్రమంలో దీపావళి సాయంత్రం క్రాకర్స్ కాలుస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేసిన బండ్లన్న ఆ సమయంలో క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే ఇక్కడే అనూహ్యంగా బండ్ల గణేష్ చిక్కుల్లో పడ్డాడు. బండ్ల గణేష్ ప్రస్తుతం అయ్యప్ప మాల ధరించారు. 41రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో ఆచరించే అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు కాళ్లకు చెప్పులు అస్సలు ధరించరు. అయితే బండ్ల గణేష్ షేర్ చేసిన దీపావళి సెలబ్రేషన్స్ వీడియోలో కాళ్లకు చెప్పులు వేసుకుని టపాసులు కాలుస్తూ తిరిగేస్తున్నారు బండ్ల గణేష్. దీంతో పలువురు ఈ విషయంలో బండ్లన్నని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయ్యప్ప మాలలో ఉండి చెప్పులు వేసుకుంటావా? అది అపచారం కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడానికి దీక్ష తీసుకోవడం ఎందుకు అని ఫైర్ అవుతున్నారు. మరికొంత మంది మాత్రం ఆయన టపాసులు పేలుస్తున్నారు కాబట్టి కాళ్లకు ఏమీ కాకుండా వేసుకున్నారు. అలా బండ్లన్న మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు.