Smuggling : ఎయిర్ పోర్టుల్లో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smuggling : కలకత్తా అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న కరెన్సీ విలువ దాదాపు 33లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా 40 వేల అమెరికన్ కరెన్సీ ని గుట్కా ప్యాకెట్స్ దాచి తరలించేందుకు ప్రయత్నం చేశాడు కేటుగాడు. కానీ అధికారులు నిర్వహించిన స్కానింగులో కరెన్సీ అక్రమ రవాణా గుట్టు రట్టయింది. ఈ కరెన్సీని కోల్ కతా నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద అధికారులు గుర్తించారు. కాటన్ బాక్స్‌లో గుట్కా ప్యాకెట్స్ నడుమ అతడు ప్యాకింగ్ చేశాడు. గుట్కా ప్యాకెట్స్ లో కరెన్సీ నోట్లను పెట్టి తిరిగి యథావిధిగా ప్యాకింగ్ చేశాడు. ఇందుకు గాను అధికారులు అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిపై అక్రమ కరెన్సీ రవాణా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: China Corona : పాలకుల పాపం.. ప్రజలకు శాపం.. చైనాలోని ప్రావిన్స్‌లో 90శాతం మందికి కరోనా
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఇదిలా ఉండగా.. తమిళనాడులోని తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 20 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బంగారాన్ని పొడి చేసి చాక్లెట్ పౌడర్ డబ్బాలో కలిపి తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. 211 గ్రాముల బంగారాన్ని పొడి చేసి మూడు చాక్లెట్ పౌడర్ డబ్బాల్లో కలిపి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ఇండియా విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ బంగారం లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. ప్రయాణికుడి చెక్-ఇన్ బ్యాగేజీలో కూడా 175 గ్రాముల బంగారు గొలుసులు కూడా లభించాయని వెల్లడించారు. మొత్తం బంగారం విలువ రూ.21.55 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..