GST: అక్టోబర్‌లో అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు.. లక్షన్నర కోట్లు దాటిన కలెక్షన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST: దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జీఎస్టీ ద్వారా వచ్చే స్థూల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18 శాతం పెరిగి అక్టోబర్ 2022లో రూ.1,51,718 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ అక్టోబర్ వసూళ్లలో 16.6 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయంలో రూ.1.30 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరిగాయి. తాజా వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.26,039 కోట్లు.. ఎస్జీఎస్టీ కింద రూ. 33,396 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐజీఎస్టీ కింద రూ.81,778 కోట్లు సమకూరినట్లు పేర్కొంది. రూ.10,505 కోట్లు సెస్సుల రూపంలో వసూలైనట్లు చెప్పింది.
Heavy Rains: తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన సర్కారు
Also Read
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్‌గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అత్యధికంగా గత ఏప్రిల్ నెలలో రూ.1.67 లక్షల వస్తు సేవల పన్ను వసూలైందని కేంద్రం పేర్కొంది. ఈ నెల వసూలైన రూ.1.51 లక్షల కోట్ల పైగా వచ్చిన జీఎస్టీ వసూళ్లు రెండో అత్యధికమని తెలిపింది. తెలుగు రాష్ట్రాల వసూళ్లను గమనిస్తే.. ఏపీలో గత ఏడాది అక్టోబర్‌లో రూ.2,879 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరగ్గా.. ఈ ఏడాది రూ.3,579 కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 24% వృద్ధి నమోదైంది. తెలంగాణలో గత ఏడాది అక్టోబర్‌లో రూ.3,854 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది 11 శాతం వృద్ధితో రూ.4,284 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!