SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SEC Anil Chandra Punetha: స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. కొన్ని చోట్ల నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం.. నామినేషన్ పత్రాలు లాక్కెళ్లడంపై పెద్ద రచ్చే జరిగింది.. అంతేకాదు.. పోలీసులు కూడా ఒక పక్షానికే మద్దతుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.. అయితే, నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు అందాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈ వ్యవహారాలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఎన్టీవీ ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పలు కీలక విషయాలను వివరించారు.
రాయచోటికి సంబంధించిన అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను నివేదిక ఇవ్వాలని కోరినట్లు అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈ మేరకు స్థానిక కలెక్టర్, ఎస్పీలకు వెంటనే ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరమైన చోట ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.
Also Read
- AP Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. నేటితో నామినేషన్లకు తెర
- AP Panchayat Elections Phase 2: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు పూర్తి వివరాలివే!
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. మళ్లీ బెజవాడకు సీబీఐ
- AP Municipal Elections 2026: ఏపీలో ఎన్నికల సందడి.. 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్..
మరోవైపు కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎస్ఈసీ తెలిపారు. ఇప్పటికే సంబంధిత ఎస్సైకి జిల్లా ఎస్పీ షోకాజ్ నోటీసు జారీ చేశారని వెల్లడించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు ఉంటాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక, ఎన్నికల్లో ఏకగ్రీవాల అంశంపై స్పందిస్తూ.. వార్డుల స్థాయిలో ఏకగ్రీవాలు జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎన్ని ఏకగ్రీవాలు జరిగాయనే దానిపై పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. సంబంధిత అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత ఏకగ్రీవాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. మొత్తంగా నామినేషన్ల సమయంలో వస్తున్న ఫిర్యాదులు, అధికారులపై చర్యలు, ఏకగ్రీవాల వివరాలపై ఎస్ఈసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
Sita in Ramayana: సీత యోధురాలే.. ఆ సాక్ష్యంతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్ నితీష్ తివారి..!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
-
Rashmika-Mysaa: కల్యాణి ప్రియదర్శన్ రికార్డుపై రష్మిక కన్ను.. ‘మైసా’తో చరిత్ర సృష్టిస్తుందా?
-
Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్‌స్టర్ సంచలనం.!
ట్రెండింగ్
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!