Scholar : డ్రగ్ మాఫియా పాలిట సింహస్వప్నం.. సంచలన కథాంశంతో ‘స్కాలర్’!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే భయం.. యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్, గంజాయి మహమ్మారి. ఈ డ్రగ్స్ ఉచ్చులో పడి ఎంతోమంది యువతీయువకులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే బర్నింగ్ ఇష్యూను తీసుకుని, దానికి కళ్లు చెదిరే కమర్షియల్, స్పిరిచ్యువల్ యాంగిల్ జతచేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సెన్సేషనల్ మూవీ ‘స్కాలర్’. అసలు ఈ సినిమా కథాంశం వింటే ఎవరికైనా గూస్బంప్స్ రావాల్సిందే! ఎందుకంటే, సాధారణంగా సినిమాల్లో హీరోలు డ్రగ్ మాఫియాను తుపాకులతోనో, కత్తులతోనో అంతం చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో హీరో రూటే సపరేట్.
డ్రగ్స్‌కు బానిసలై పిట్టల్లా రాలిపోతున్న యువతను తిరిగి మామూలు మనుషులను చేయడానికి హీరో ఒక పవర్ ఫుల్ విరుగుడు (యాంటీ-డ్రగ్) కనిపెడతాడు. దీంతో అతనికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. హీరో దెబ్బకు వణికిపోయిన డ్రగ్ మాఫియా.. కక్షకట్టి అతని కుటుంబాన్ని, కన్న చెల్లిని అత్యంత దారుణంగా అంతం చేస్తుంది. మరి తన సర్వస్వాన్ని కోల్పోయిన ఆ యువకుడు.. దేశం మొత్తం నివ్వెరపోయేలా ఒక ‘స్పిరిచ్యువల్ బ్యాక్ డ్రాప్’ లో ఆ క్రూరమైన మాఫియాను ఎలా మట్టుబెట్టాడన్నదే ఈ ‘స్కాలర్’ అసలు కథ! ఒకవైపు సైన్స్, మరోవైపు దైవత్వం కలగలిపిన ఈ పగ, ప్రతీకారాల కాన్సెప్ట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
బాలల దినోత్సవాన్ని (నవంబర్ 14) పురస్కరించుకుని గురువారం నాడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వేదికగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. గతంలో ఎన్నో అద్భుతమైన సందేశాత్మక చిత్రాలు తీసిన డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్లపై న్యూ జెర్సీకి చెందిన పొగాకు శిరీష మహేష్ సౌజన్యంతో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. కౌశిక్, ప్రతిభా సిన్హా జంటగా నటిస్తుండగా.. డైరెక్టర్ సుధాకర్ గౌడ్, పెంచల్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
- The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!
- UP Congress-SP Alliance: 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. లీకైన జాబితాతో అఖిలేష్‌పై ఒత్తిడి!
- Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
తాజావార్తలు
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
-
Janta Movie: మెగా హీరో ‘జంట’ సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
-
The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!
-
UP Congress-SP Alliance: 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. లీకైన జాబితాతో అఖిలేష్‌పై ఒత్తిడి!
-
Success Story: ఐఐటీ కుర్రాడి క్రేజీ బిజినెస్ ఐడియా.. కుల్దీప్ సక్సెస్ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!