NTV Telugu Site icon

CM YS Jagan: ప్రచారంలో వైసీపీ దూకుడు.. సీఎం జగన్‌ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..

Jagan

Jagan

CM YS Jagan: సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు మూడో విడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రేపు టంగుటూరు, మైదుకూరు, కలికిరిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం జగన్‌. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల 30వ తేదీ షెడ్యూల్‌ను పార్టీ విడుదల చేసింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం12.30 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు 4 రోడ్ల జంక్షన్‌లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.

Read Also: CM YS Jagan: ఏపీలో హీరో ఎవరో.. విలన్‌ ఎవరో.. ప్రజలు తెలుసుకోవాలి..

ఇక, ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. సోమవారం రోజున కొత్తూరు, అంబాజీపేట, పొన్నూరు ప్రచార సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ ఐదేళ్లలో వైసీపీ ఏం చేసిందో చెబుతూనే, కూటమిపై పంచ్‌లు, సెటైర్లు వేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు, ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్లు అంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి జగన్‌. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమేనన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు జగన్‌. రాబోయే ఐదేళ్లు అభివృద్ధిని, ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించబోయేవి ఈ ఎన్నికలన్నారు. కూటమిపై పార్టీల తీరును తూర్పారబట్టారు జగన్‌. వాళ్లకు దోచుకోవడం, పంచుకోవడమే మాత్రమే తెలుసన్నారు. చంద్రబాబు మార్క్‌ దోపిడి సామ్రాజ్యం మళ్లీ రావొద్దంటే వైసీపీని గెలిపించాలని కోరారు జగన్‌.