తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ రెండు చారిత్రాత్మక బిల్లులను నేడు శాసన సభలో ప్రవేశపెట్టనున్నది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులతో పాటు మొత్తం ఐదు బిల్లులను సభలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్నది. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు.
Also Read:AP 10th Exams 2025: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. చివరి నిమిషం వరకూ అనుమతి, ఉచిత బస్సు సౌకర్యం!
ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ బిల్లు ( రాష్ట్రంలో విద్య..ఉద్యోగ రంగాల్లో అమలు ), బీసీలకు అర్బన్ అండ్ లోకల్ బాడి లో రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుల ద్వారా బీసీలకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతోపాటు, సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనున్నది.