SBI Bank Robbery Case: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో గత ఏడాది జూలై 27న జరిగిన ఎస్బిఐ (SBI) బ్యాంక్ దోపిడీ కేసును రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కీలకమైన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసి, భారీగా బంగారు నగలు సహా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. పోలీసులు వివరాల ప్రకారం.. గత సంవత్సరం జూలై 27న తూముకుంట వద్ద ఉన్న ఎస్బిఐ బ్యాంక్‌లోని లాకర్లను గ్యాస్ కట్టర్‌తో తెరిచి సుమారు 11 కేజీల బంగారు నగలను అంతర్రాష్ట్ర దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు.
Cigarette Prices: సిగరెట్ ప్రియులకు చేదు వార్త.. ఇంత పెట్టి కొనడం కంటే మానుకోవడమే మంచిది భయ్యా!
ఈ కేసులో భాగంగా గత సంవత్సరం ఆగస్టులో హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ పన్వర్ అనే దోపిడీ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.3.50 కోట్ల విలువ చేసే బంగారు నగలు, ఒక కారు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దోపిడీకి గురైన మిగతా బంగారం కోసం మూడు ప్రత్యేక బృందాలతో పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగించారు. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఇష్ రార్ ఖాన్ అనే మరో అంతర్రాష్ట్ర దొంగను పీటీ వారెంట్ ద్వారా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.5.50 కోట్ల విలువ చేసే బంగారు నగలు, ఒక కారు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad: న్యూ ఇయర్ వేళ విషాదం.. బిర్యానీ తిని ఒకరు మృతి.. అపస్మారక స్థితిలో మరో 15 మంది
ఈ దొంగలు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంక్ దోపిడీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. తూముకుంట బ్యాంక్ దోపిడీ అనంతరం కూడా పలు చోట్ల వీరు దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు దోపిడీ దొంగలపై దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 14 దోపిడీ కేసులు నమోదైనట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఇంకా రికవరీ కావాల్సిన కొంత బంగారు నగల కోసం దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.