ఉప్పరపల్లి గౌతమ్ నగర్ లో ఎస్‌బీ ఇన్స్పెక్టర్ పై దాడి జరిగింది. చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబంలో పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలు నోట్ చేస్తుండగా ఆగ్రహంతో సీఐపై మృతుల బంధువుల దాడి చేశారు. మీడియాను మృతుల కుటుంబ సభ్యులు అనుమతించలేదు. గౌతమ్ నగర్ కు వెళ్లిన మీడియా, పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: YS Jagan: తిరుపతిలో దళిత విద్యార్థిపై దాడి.. అధికార పార్టీ డైరెక్షన్‌లో కక్షసాధింపు చర్యలు
ఇదిలా ఉండగా.. చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి చెందారు. దీంతో కుటుంబీకులు ఆగ్రహంతో ఉన్నారు.
READ MORE: Tollywood : ఎగ్జిబిటర్ల సంచలన నిర్ణయం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్..
ఒకే కుటుంబానికి చెందిన మృతుల పేర్లు..
ప్రహ్లాద్ రాయ్
మున్ని
వర్షా
పంకజ్
అనియ
ఇద్ర
ఇరాజ్
అభిషేక్
రాజేంద్ర
సుమిత్ర
