Hyderabad: పాతబస్తీ గోమతి ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో శాలిబండ భారీ అగ్ని ప్రమాదంపై సస్పెన్స్ వీడింది.. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.. రిఫ్రిజిరేటర్లు, ఏసీ కంప్రెషర్లలో భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి షోరూమ్ ముందు పార్క్ చేసిన కారు పల్టీలు కొట్టింది.. అద్దాలు పగలగొట్టి డ్రైవర్ బయటపడ్డాడు.. కాసేపటికే…
గుల్జార్హౌజ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారి తీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టేందుకు, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఉప్పరపల్లి గౌతమ్ నగర్ లో ఎస్‌బీ ఇన్స్పెక్టర్ పై దాడి జరిగింది. చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబంలో పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలు నోట్ చేస్తుండగా ఆగ్రహంతో సీఐపై మృతుల బంధువుల దాడి చేశారు. మీడియాను మృతుల కుటుంబ సభ్యులు అనుమతించలేదు. గౌతమ్ నగర్ కు వెళ్లిన మీడియా, పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానన్నారు. ఈ విషాద ఘటన హృదయవిదారకంగా ఉందని.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.