Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
- సౌదీలో భారీగా యురేనియం నిల్వలు..
- మదీనా ప్రాంతంలో కనుగొన్నట్లు వెల్లడి..
- ఉద్రిక్తతల వేళ సౌదీ జాక్పాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia: సౌదీ అరేబియా జాక్పాట్ కొట్టింది. మదీనాలో భారీ స్థాయిలో యురేనియం, రేర్ ఎర్త్ మెటల్స్ నిల్వలను కొనుగోన్నట్లు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీబ్ బిన్ సల్మాన్ను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా నివేదించింది. మదీనాలోని ‘జబల్ సయీద్’ ప్రాజెక్టు వద్ద చేపట్టిన అన్వేషన, భౌగోళిక అధ్యయనాల్లో సుమారు 110 మిలియన్ టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నట్లు తేలింది. ఇందుల్లో యురేనియంతో పాటు హెవీ మెటల్స్ ఉన్నట్లు తేలింది.
ఇరాన్ యుద్ధం, సౌదీపై హౌతీల దాడుల నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. అరబ్ దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన సౌదీ, తన ఇంధన, ఖనిజ వనరుల్ని వైవిధ్యీకరించడంలో పెట్టుబడులు పెడుతోంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని విజన్ 2030లో భాగంగా చమురు ఆధారిత ఆర్థిక రంగాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు.
Also Read
ఇటీవల సౌదీ-అమెరికా మధ్య పౌర అణు కార్యక్రమ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ యురేనియం నిల్వల్ని కనుగొనడం ఒక ముఖ్యమైన పరిణామం. జూలైలో రెండు దేశాలు ఈ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా సౌదీ పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇదే కాకుండా సౌదీ అరేబియా ‘‘ఎన్రిచ్డ్ యురేనియం’’ తయారు చేసుకునే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పిస్తుంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!