సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అందరూ హైదరాబాద్ వాసులే అని తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. చనిపోయిన వారిలో విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబం మొత్తం ఉంది. హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్ తన 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లగా.. అంతలోనే ఘోర ప్రమాదం ఆయన కుటుంబాన్ని కబళించింది. ఈ 18 మంది అంత్యక్రియలు మక్కాలోని మదీనాలోనే జరపమని మృతుల కుటుంబం అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.
Also Read: iPhone 17 vs OnePlus 15: మీ బడ్జెట్ 70 వేలా.. ఐఫోన్ 17, వన్‌ప్లస్ 15లలో ఏది బెటర్!
నజీరుద్దీన్ ఫ్యామిలీ మక్కాకు వెళ్లారు. వచ్చే వారం హైదరాబాద్ వచ్చేవారు. ఇంతలోనే అందరూ మృతి చెందడం మమ్మల్ని బాధిస్తుంది. బస్సు ప్రమాదంలో 18 మంది కుటుంబ సభ్యులను కోల్పోయాం. నజీరుద్దీన్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఇటీవలే ఆయన కొడుకు అమెరికా నుంచి వచ్చారు. నజీరుద్దీన్ భార్య, ఇద్దరు కొడుకులు, కోడళ్లు, ఆరుగురు చిన్నారులు మొత్తం 18మంది చనిపోయారు. కుటుంబానికి పెద్దదిక్కు సలావుద్దీన్ ఇటీవలే అమెరికా నుంచి వచ్చారు. కుటుంబంలో ఇద్దరిని మక్కాకు తీసుకువెళ్తాం అన్నారు. ప్రభుత్వం, ఎంబసీ నుంచి మాకు కాల్స్ వచాయి. మృతదేహాలను త్వరితగతిన హైదరాబాద్ తీసుకొస్తాం అన్నారు. ఎంబసీ, విదేశాంగ మంత్రులతో పాటు ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. విద్యానగర్ అడిక్‌మెట్‌కు చెందిన నసీరుద్దీన్ 18 కుటుంబ సభ్యుల అంత్యక్రియలు మక్కాలోని మదీనాలోనే జరుగుతాయి. అక్కడే జరపమని ప్రభుత్వానికి చెప్పాం. ఇక్కడి నుంచి మక్కాలో జరిగే అంత్యక్రియలకు అటెండ్ అవ్వడానికి నసీరుద్దీన్ బంధువులం ఇద్దరం వెళ్తున్నాం’ అని నసీరుద్దీన్ బంధువులు ఎన్టీవీతో చెప్పారు.