బతుకమ్మ పండగను అవమాన పరిచేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డా మంత్రి సత్యవతి రాథోడ్. ఇవాళ మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తక్షణమే జీవన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ పండగకు అసలైన వైభవం తెచ్చింది ఎమ్మెల్సీ కవితేనని ఆమె అన్నారు. బతుకమ్మ ను మందు బాటిళ్లు పెట్టి ఆడాలనే వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు.
Also Read : Kerala: ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసులో నిషేధిత పీఎఫ్ఐ వ్యక్తి అరెస్ట్..
అంతేకాకుండా.. ప్రియాంకకు మందు బాటిళ్లు పెట్టే బతుకమ్మను ఇచ్చారా ? అని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. జగిత్యాల లో ఓటమి ఖాయం అని తెలిసి జీవన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను అవమానించి నట్టు కాదు ..మొత్తం తెలంగాణ మహిళలనే అవమానించారని ఆమె ధ్వజమెత్తారు. ఢిల్లీ పెద్దల దగ్గర కాంగ్రెస్ నేతలు తెలంగాణ అస్థిత్వాన్ని తాకట్టు పెట్టారని, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చే విషయంలో సపోర్ట్ చేయని కాంగ్రెస్ ఇప్పుడు 12 శాతం అని మాట్లాడుతూ మోసం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎమ్మెల్యే సీతక్కకు ప్రచార ఆర్భాటం తప్పితే అభివృద్ధి తెల్వదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎంలను మార్చకుండా ఉంటారా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 88 సీట్లు గెలిచామని ఈ సారి 108 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Batukamma: బతుకమ్మ సంబురాల్లో సందడి చేసిన సీరియల్ తారలు