Satyavati Rathod : కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పరిపాలించి ప్రజల సంక్షేమాన్ని మరిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సత్య రాథోడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, , మహబూబా బాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. 2018లో ప్రజల ఆమోదంతో రెండవ సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈరోజు దేశంలోనే తెలంగాణను ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ది అని ఆమె కొనియాడారు. బీఆర్ ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాయకులది, కార్యకర్తలదని ఆమె అన్నారు.
అంతేకాకుండా.. ‘మన నాయకుడు నవంబర్ 1న జరిగే కేసీఆర్ సభకు 80వేల ప్రజలను సమీకరించాలి. కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. రాష్ట్రంలో అత్యధిక పట్టాలిచ్చిన ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు నియోజకవర్గంలో 18 వేల కుటుంబాలకు పోడు పట్టాల పంపిణీ, కేసీఆర్ మానస పుత్రిక సీతారాంసాగర్ ప్రాజెక్టు ఇల్లందు నియోజకవర్గంలో ఎక్కువ లాభం చేకూరే విధంగా కార్యాచరణ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచితంగా తెలంగాణలో రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంటు సరాఫర.. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పరిపాలించి ప్రజల సంక్షేమాన్ని మరిచింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాజస్థాన్, రాష్ట్రాలలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కేసీఆర్ పాలన దేశంలో ఆదర్శంగా నిలిచింది. 10 ఏండ్లుగా బీజేపీ తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలంగాణ ద్రోహులు -బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడ్డుకున్నది బీజేపీ పార్టీ. కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఒకటే. 65 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు, 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు. బీఆర్ఎస్ పార్టీని ఆదరించి ఇల్లందు నియోజకవర్గంలో హరిప్రియ నాయక్‌ను గెలిపించాలి. ఏ సమస్యలు వచ్చినా కార్యకర్తలను ఆదుకుంటాం.’ అని సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..