satyavati rathod dance at teej festival
గిరిజనుల సాంస్కృతిక పండుగ తీజ్. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్’ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా ‘తీజ్’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే తీజ్లో నవధాన్యాలను, గోధుమ మొలకలను పూజించడం ఆనవాయితీ. గిరిజనుల సాంస్కృతిక పండుగ తీజ్ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. అయితే ఈ తీజ్ ఉత్సవాలకు మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపీ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ అందరితో కలిసి ఆడి పాడారు.
అంతేకాకుండా..తీజ్ పండగ సందర్భంగా గోధుమ మొలకల బుట్టలను నెత్తిన పెట్టుకొని గిరిజన నృత్యం చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. ప్రకృతిని ఆరాధిస్తూ గొప్పగా పూజించే తీజ్ ఉత్సవాలు అని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ గిరిజన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు సత్యవతి రాథోడ్.