ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఫీవర్ మొదలైంది. ఈ సంక్రాంతికి కానుకగా నేడు థియేటర్లలో గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ టాక్ వినిపిస్తుంది.అలాగే ఓటీటీలో కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా మరో మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. అదే ‘సర్కారు నౌకరి’. సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ గోపరాజు హీరోగా పరిచయం అయ్యాడు.. డిఫరెంట్ టైటిల్, వైవిధ్యమైన కథ కథనాలతో మొదటి సినిమా తోనే ఆకాష్నటనపరంగా మెప్పించాడు. నూతన సంవత్సరం కానుకగా ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన పన్నెండు రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు థియేటర్లలలో మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీ లో చూడొచ్చు.ఈ చిత్రాన్ని గంగనమోని శేఖర్ తెరకెక్కించగా.. ఆర్కే టెలిషో బ్యానర్ పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాను నిర్మించారు. ఇందులో భావన ఆకాష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతోనే ఈ భామ హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి మరియు మధులత కిీలకపాత్రలు పోషించారు. ఎయిడ్స్ వ్యాధి నివారణ కై కండోమ్స్ పై అవగాహన కల్పిస్తూ రూపొందించిన ఈ సినిమాలో ఆకాష్ గోపరాజు నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఈ చిత్రం కథ విషయానికి వస్తే ఇందులో గోపాల్ (ఆకాష్ గోపరాజు) ఎయిడ్స్ పై అవగాహన కల్పించే ఉద్యోగం చేస్తుంటాడు. కండోమ్స్ పంచే జాబ్ చేసే అతనికి సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి..ప్రేమించి పెళ్లి చేసుకున్న సత్య (భావన) అతడికి ఎందుకు దూరమైంది.. అన్నది ఈ చిత్ర కథ. ఈ సినిమా లో కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా లేకపోవడంతో ఈ సినిమా ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ సాధించలేకపోయింది.
Immerse yourself in the powerful story of #SarkaaruNoukari, where a man's vision for societal change unfolds🏥
STREAMING NOW ON @PrimeVideoIN
▶️ https://t.co/KvyxEOvlFT@Ragavendraraoba @ShekarPhotos @AkashGoparaju98 @BVazhapandal @vasuanv @MangoMusicLabel pic.twitter.com/jk5jJdmi6T— Mango Videos (@mangovideos) January 12, 2024