Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్!
- సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు నాని
- ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్
- సుదర్శన్ థియేటర్లో ట్రైలర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saripodhaa Sanivaaram Pre Release Event Date: దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన ‘నేచురల్ స్టార్’ నాని త్వరలో ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నానితో ‘అంటే సుందరానికి’ లాంటి క్లాసిక్ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రంకు దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సరిపోదా శనివారం మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్ అయింది.
సరిపోదా శనివారం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగష్టు 24న జరగనుంది. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. అయితే ప్లేస్ ఎక్కడో మాత్రం ప్రకటించలేదు. అయితే హైదరాబాద్‌లోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ లేదా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా తీసుకురావాలని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సుదర్శన్ థియేటర్లో సరిపోదా శనివారం ట్రైలర్ విడుదల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
Also Read: Imanvi Esmail: అందుకే ప్రభాస్‌కు జోడిగా ఇమాన్వీని ఎంపిక చేశా: హను రాఘవపూడి
సరిపోదా శనివారం సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటించారు. డైరెక్టర్ ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటించారు. మాస్ కమర్షియల్ సినిమాలా ఇది ఉండబోతుందని అంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో హిట్ కొట్టి నాని మరోసారి హ్యాట్రిక్ కొడతాడని ఫాన్స్ భావిస్తున్నారు.
#SaripodhaaSanivaaram Pre Release Event on AUGUST 24th 🔥🔥🔥🔥
— DVV Entertainment (@DVVMovies) August 21, 2024
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!