Imanvi Esmail: అందుకే ప్రభాస్‌కు జోడిగా ఇమాన్వీని ఎంపిక చేశా: హను రాఘవపూడి
- హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా
- ప్రభాస్‌కు జోడిగా ఇమాన్వీ
- ప్రతిభ కలిగిన అమ్మాయి ఇమాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Hanu Raghavapudi on Imanvi Esmail: సలార్, కల్కి 2898 ఏడీ చిత్ర విజయాలతో జోరుమీదున్న ‘రెబల్ స్టార్’ ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడిగా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఎస్మాయిల్‌ను ఎంపిక చేశారు. ఎందరో స్టార్ హీరోయిన్స్ ఉండగా.. ఒక్క సినిమా కూడా చేయని ఇమాన్వీకి పాన్ ఇండియా స్టార్‌తో నటించే అవకాశం ఎలా వచ్చిందబ్బా? అని అందరూ అనుకుంటున్నారు. తాజాగా దీనిపై డైరెక్టర్ హను రాఘవపూడి స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో హను రాఘవపూడి మాట్లాడుతూ… ‘ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొత్త టాలెంట్‌ను వెలికితీయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. కథకు అనుగుణంగా నటీనటులను ఎంపిక చేసుకోవడంలో ఫిల్మ్ మేకర్స్‌కు సోషల్ మీడియా ఎంతో సాయం చేస్తుంది. ఇమాన్వీ అందం మాత్రమే కాదు మంచి ప్రతిభ కలిగిన అమ్మాయి. నేనూ కూడా ఆమె డ్యాన్స్ వీడియోలు చూస్తా. ఇమాన్వీ మంచి క్లాసికల్ డ్యాన్సర్. కళ్లతోనే ఎన్నో హావభావాలను పలికిస్తుంటుంది. అందుకే ఇమాన్వీకి అవకాశం ఇవ్వాలనుకున్నా. ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్ తర్వాతే ఎంపిక చేశాం. ఇమాన్వీని సెలెక్ట్ చేయడం నా ఒక్కడి నిర్ణయం కాదు. చిత్ర యూనిట్ మొత్తం ఓకే చెప్పింది’ అని తెలిపారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
Also Read: Football Match: మైదానం పక్కనే ఆ పనికానిచ్చేసిన ప్లేయర్.. చివరకు ఏమైందంటే? (వీడియో)
ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా ఇమాన్వీ ఎస్మాయిల్ అందరికి తెలుసు. హిందీ, తెలుగు, తమిళ పాటలకూ ఆమె డాన్స్ చేస్తుంటుంది. ఆమెకు ఇన్‌స్టాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభాస్‌తో సినిమా ప్రకటించిన తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగింది. అంతేకాదు ఇమాన్వీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సినిమాకు ఇమాన్వీ రెమ్యునరేషన్ ఏకంగా కోటి రూపాయలు అని తెలుస్తోంది. ఒక హీరోయిన్ తొలి సినిమాకే ఇంత మొత్తం రెమ్యునరేషన్ తీసుకోవడం సాధారణ విషయం కాదు.
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!