సారా అలీ ఖాన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ స్టార్ హీరో అయిన సైఫ్ అలీ ఖాన్ వారసురాలి గా బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఈ భామ కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అద్భుతమైన నటనతో సారా అలీ ఖాన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. మొదటి సినిమాతోనే ప్రతిభ చాటుకుంది ఈ భామ.అలాగే ఆ సినిమాకు గాను ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది సారా అలీఖాన్. సారా అలీ ఖాన్ తాజాగా నటించిన “జర హట్కే జర బచ్కే” సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ మూవీ అని తెలిపింది సారా అలీ ఖాన్. ప్రస్తుతం బాలీవుడ్ లో డిఫరెంట్ జానర్ లలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ భామ.
ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో వరుసగా సినిమాలలో చేస్తూ కాస్త కూడా తీరిక లేకుండా ఎంతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే తొలి సినిమా నుంచే డిఫరెంట్ జానర్స్ ఎంపిక చేసుకుంటూ అద్భుతంగా నటించి మెప్పిస్తుంది.అలాగే నటనపరమైన పాత్రలతో పాటుగా గ్లామర్ పాత్రలు కూడా చేస్తూ మెప్పిస్తుంది ఈ భామ. ఇది ఇలా ఉంటే తాజాగా సారా అని తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఆమె మాట్లాడుతూ మామూలుగా కెరియర్ లో సక్సెస్ మూడు స్టేజ్ లలో ఉంటుంది. ప్రస్తుతం నేను ఆ థర్డ్ ఫేస్ ను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.అలాగే కెరిర్ లో నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. కెరీర్ ప్రారంభ సమయంలోనే వర్సటైల్ రోల్స్ చేసే అదృష్టం నాకు వచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఉంది. మరిన్ని విభిన్న పాత్రలు చేయాలని ఉంది అని తెలిపింది సారా అలీ ఖాన్.