Vadakupatti Ramasamy: సంతానం హీరోగా ‘వడక్కుపట్టి రామసామి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vadakupatti Ramasamy: ‘గూఢచారి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పలు అద్భుత విజయాలను సాధించింది. హిట్స్ సాధించి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. విట్ నెస్, సాల వంటి చిత్రాలను నిర్మించడం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అక్కడా కూడా తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ‘వడక్కుపట్టి రామసామి’ పేరుతో తమిళంలో మూడో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రం కోసం ‘డిక్కిలోన’తో బ్లాక్ బస్టర్ జోడీగా పేరు తెచ్చుకున్న నటుడు సంతానం, దర్శకుడు కార్తీక్ యోగితో మరోసారి చేతులు కలిపారు. జాన్ విజయ్, ఎంఎస్ భాస్కర్, రవి మరియ, మారన్, మొట్టా రాజేంద్రన్, నిజల్గల్ రవి, శేషు, ప్రశాంత్, జాక్వెలిన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.
సీన్ రోల్డాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘విట్ నెస్’ చిత్రంతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న దీపక్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా శివ నందీశ్వరన్, ఆర్ట్ డైరెక్టర్గారాజేష్, కొరియోగ్రాఫర్‌గా షరీఫ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో టి.జి.విశ్వప్రసాద్, కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల వంటి దూరదృష్టిగల నిర్మాతలు ఉన్నారని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రియేటివ్ ప్రొడ్యూసర్ వి. శ్రీనటరాజ్ అన్నారు. వీరు తెలుగులో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అద్భుతమైన చిత్రాలను అందించారన్నారు. మేము తమిళ సినిమాలను నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు, మంచి కమర్షియల్ ఎంటర్టైనర్లను అందించాలనుకున్నామని వెల్లడించారు.
Also Read
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ఎలాంటి జోనర్‌లోనైనా ఒదిగిపోయి అలరించగల నటుడు సంతానంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నామని ఆయన నటరాజ్ పేర్కొన్నారు. అనుకోకుండా అతను నటించిన ‘డిక్కిలోన’ సినిమా చూసి.. చిత్ర దర్శకుడు కార్తీక్ యోగిని కలిశామని, ఆయన తమకు ఒక అద్భుతమైన కథను చెప్పారని తెలిపారు. వడకుపట్టి రామసామి ప్రముఖ నటుడు గౌండమణి ప్రసిద్ధ పాత్రలలో ఒకదానిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇది ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మీమ్ మెటీరియల్‌గా మారిందన్నారు. కార్తీక్ కథ చెప్పినప్పుడు సినిమా సారాంశం, కథానాయకుడి పాత్ర చక్కగా కుదిరాయని అనిపించిందన్నారు.
Waltair Veerayya: పది రోజులైనా తగ్గేదేలే.. డబుల్ సెంచరీ కొట్టిన ‘వాల్తేరు వీరయ్య’
రామసామి అనే పేరు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతీక అయినందున అందులో చాలా పొరలు దాగి ఉంటాయని ఆయన చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా దర్శకుడు కార్తీక్.. గౌండమణికి వీరాభిమాని అని తెలిపారు. అతని మునుపటి చిత్రం ‘డిక్కిలోన’ కూడా ప్రముఖ నటుడి కామెడీ లైన్ల నుండి ప్రేరణ పొందిందన్నారు. పీరియడ్ కామెడీ-డ్రామాగా తెరకెక్కనున్న వడకుపట్టి రామసామి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుందని మేము బలంగా నమ్ముతున్నామన్నారు.
చిత్రానికి సంబంధించి పేరుతో కూడిన ప్రచారచిత్రం విడుదల చేసిన నిర్మాతలు.. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం షూటింగ్ రేపు(జనవరి 24న) ప్రారంభం కానుందని తెలిపారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!