Cyberabad Police: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!.. ఈ నంబర్‌కి సమాచారం ఇవ్వండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyberabad Police: సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ క్రైమ్స్ ప్రజలకు పలు సూచనలు చేశారు.
READ MORE: Realme 16 Pro 5G Launch: రియల్‌మీ ‘బాహుబలి’ ఫోన్ వచ్చేస్తోంది.. 2 రోజుల పాటు ఛార్జర్ అవసరం లేదు!
Also Read
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..
ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లను ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం మంచిది. విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలపరాదు. బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, దినపత్రికలను & పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. వాటిని గమనించి మీరు ఇంట్లో లేరనే విషయాన్ని దొంగలు గమనిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోండి. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకపోవడం మంచిది. ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ వేయాలి. వాచ్ మెన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం, లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి. బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరిస్తారు.
ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్ లైన్లో ఎప్పటికప్పుడు చూసుకొంటూ ఉండాలి. మీ ఇంటికి వచ్చే, వెళ్ళే దారులు, ఇంటిలోపల సీసీ కెమెరాలు అమర్చు కొని డీవీఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశం లో అమార్చండి. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్/ప్రత్యక్షంగా చూసుకునే వీలుంది. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సీసీటీవీలు ఆన్లైన్/ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. హోమ్ సెక్యూరిటీ సర్వెలెన్స్ కు ఇవి ఎంతో ఉపయుక్తం. ఇంటి భద్రతాపరంగా ఇంటికి దృఢమైన, నాణ్యమైన తలుపులతో పాటు హై ఎండ్ సెక్యూరిటీ లాక్ సిష్టంని వాడడం మంచిది. సొంత ఇల్లు అయినట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్ అమర్చుకోవడం ద్వారా రెండంచెల భద్రతనిస్తుంది. ఇంట్లో, ఇంటి బయట మోషన్ సెన్సర్ లను ఉపయోగించడం మంచిది. ఇంటి బయట మోషన్ సెన్సర్ లైట్లను ఉపయోగించండి. ఇవి చీకటి ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తాయి. సెన్సార్లు పరిసరాల్లో ఏదైనా కదలిక గుర్తించగానే లైట్ వెలుగుతుంది. సాధారణంగా సరైన భద్రతా ప్రమాణాలు పాటించని ఇండ్లు, చీకటి ప్రదేశం, పాత గ్రిల్స్, బలహీనమైన తాళాలు ఉన్న ఇండ్లలో దొంగలు పడే అవకశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీసు స్టేషన్ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్ కానిస్టేబుల్ నెంబర్ దగ్గర ఉంచుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం.
అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టుపక్కల వారికి లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను, వాచ్ మెన్ ను నియమించుకోవాలి. కాలనీవాళ్లు కమిటీలు వేసుకొని వాచ్‌మెన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వచ్చినా వారి వివరాలు తెలుసుకుని రిజిస్టర్‌లో నమోదు చేసుకోవడం మంచిదని అపార్టుమెంట్ వాచ్‌మెన్‌లకు తెలపాలి. సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే వివరాలు ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నెంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలి.
తాజావార్తలు
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!