Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్‌కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Bonus ₹8,000 WhatsApp Message Fake: దీపావళి పండగ వస్తోందంటే చాలు, కొత్త బట్టలు, షాపింగ్ అంటూ అందరిలోనూ జోష్ ఉంటుంది. ఇదే సమయంలో వాట్సాప్‌లో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. దీపావళి బోనస్ కింద రూ. 8,000 ఇస్తున్నారంటూ అందులో చెబుతున్నారు. మీ వాట్సాప్‌కూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా? అయితే వెంటనే అప్రమత్తం కావాల్సిందే. లేదంటే మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావడం ఖాయం. ప్రధాని తరఫున దీపావళి కానుకగా ప్రతి ఒక్కరికీ ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నట్లు ఆ వాట్సాప్ మెసేజ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అందులో ఒక లింక్ ఇచ్చి, దానిపై క్లిక్ చేసి వివరాలు నింపితే నేరుగా డబ్బులు ఖాతాలో జమ అవుతాయని నమ్మిస్తున్నారు. కానీ అసలు నిజం వేరే ఉంది. పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఈ వార్త పూర్తిగా ఫేక్ అని తేల్చిచెప్పింది. కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి దీపావళి బోనస్ ప్రకటించలేదని స్పష్టం చేసింది. కాబట్టి ఎవరూ ఈ ఫేక్ మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దు.
ఈ ఆన్లైన్ మోసగాళ్లు జనాలను బురిడీ కొట్టించడానికి రకరకాల ఎత్తులు వేస్తుంటారు. మొదట డబ్బుల ఆశ చూపి వాట్సాప్‌లో నకిలీ లింకులు పంపిస్తారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీ పేరు, ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలు అడుగుతారు. కొన్నిసార్లు ఏకంగా ఓటీపీ (OTP) లేదా యూపీఐ పిన్ (UPI PIN) చెప్పమని బెదిరిస్తుంటారు. ఆ వివరాలు కనుక ఇచ్చేశారంటే క్షణాల్లో మీ కష్టార్జితమంతా హాంఫట్ అయిపోతుంది. అందుకే ఆ ఎనిమిది వేల రూపాయల ఆశలోపడి మీ బ్యాంకు ఖాతాను ప్రమాదంలోకి నెట్టేసుకోకండి.
Also Read
- Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
- ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
- NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
- Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
ఇలాంటి సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాట్సాప్‌లో వచ్చే ఇలాంటి బోనస్ లింకుల జోలికి అసలు వెళ్లొద్దు. ఎవరితోనూ మీ ఓటీపీ, యూపీఐ పిన్ లేదా బ్యాంక్ వివరాలు పంచుకోవద్దు. ఏ ప్రభుత్వ పథకం గురించైనా సమాచారం కావాలంటే కేవలం అధికారిక వెబ్సైట్లలో మాత్రమే చెక్ చేయాలి. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఆన్లైన్ మోసానికి గురైతే, వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో రిపోర్ట్ చేయాలి. దీపావళి వేళ వచ్చే ఈ ఫేక్ బోనస్ లంచ్‌లో పడకుండా, కాస్త అప్రమత్తంగా ఉంటే పెద్ద నష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్‌కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!