Game Changer: పొంగల్ ఫైట్ గట్టిగా ఉందే.. ‘గేమ్ ఛేంజర్’కు తిప్పలు తప్పవా?
- సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్
- సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు
- రేసులోకి దూసుకొచ్చిన విదాముయార్చి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సంక్రాంతి’ అంటేనే.. సినిమాల సీజన్. నాలుగైదు సినిమాలు రిలీజ్ అయినా సరే.. బక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే 2025 సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు డేట్ లాక్ చేసి పెట్టుకున్నాయి. జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’, 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే మైత్రీ మూవీస్ బ్యానర్లో ‘తలా’ అజిత్ కుమార్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా పొంగల్ రేసులో ఉందని అన్నారు. కానీ ఈ సినిమా వాయిదా పడింది. అయితే అజిత్ నటించిన మరో సినిమా మాత్రం సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చింది.
అజిత్ నటిస్తున్న విదాముయార్చి సినిమా టీజర్‌ను నేడు చిత్ర యూనిట్ రిలీజ్ చేసి.. సంక్రాంతికి వస్తున్నాం అని అనౌన్స్ చేశారు. ఇది డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ.. నాలుగు బడా సినిమాలంటే థియేటర్ల సర్దుబాటుకు కాస్త ఇబ్బందే. తమిళ్‌లో మాత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతున్న గేమ్ ఛేంజర్‌కు గట్టి పోటీ తప్పదు. రామ్ చరణ్, శంకర్ క్రేజ్‌తో తమిళ్‌లో భారీ ఎత్తున గేమ్ ఛేంజర్ రిలీజ్ కాబోతోంది. కానీ అజిత్‌తో పోటీ అంటే కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సిందే. తమిళ్‌లో తలా ఫ్యాన్స్‌ను తట్టుకోవడం కష్టమే. తమిళ్ వరకు విదాముయార్చిపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి గేమ్ ఛేంజర్ ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
Also Read
- Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
- NATO: ఇరాన్‌పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్‌కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
- Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
- PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
Also Read: IND vs AUS: విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తుంటే.. మా ప్లేయర్స్ ఏం చేశారో: క్లార్క్
దాముయార్చి సినిమా టీజర్ పవర్ ఫుల్‌గా కట్ చేశారు. ఒక నిమిషం 48 సెకండ్ల నిడివి గల టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదు. టీజర్‌ను ఫుల్ యాక్షన్‌తో నింపేశారు. దీంతో.. తలా ఫ్యాన్స్ వెయిటింగ్ అని అంటున్నారు. ఇందులో త్రిష, రెజీనా, అర్జున్, సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు. జనవరి 9న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈసారి పొంగల్ ఫైట్ మాత్రం గట్టిగా ఉంటుందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్‌పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్‌కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
-
Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
-
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..