Site icon NTV Telugu

Sankranthiki Vasthunam: టీఆర్పీ రేటింగ్స్‌లో “సంక్రాంతికి వస్తున్నాం” సరి కొత్త రికార్టు

Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam

వెంకటేష్ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకున్న విషయం తెలిసిందే.

READ MORE: Annamalai: ‘‘మూర్ఖపు స్టాలిన్’’.. ‘‘రూపాయి గుర్తు మార్పు’’పై అన్నామలై ఫైర్..

తెలుగులో తొలిసారి ఒకే సమయంలో అటు టీవీ, ఇటు ఓటీటీలోకి ఈ సినిమాను తీసుకొచ్చారు. రెండింట్లోనూ మూవీ ప్రజాదారణ పొందింది. తాజాగా టీవీ ప్రీమియర్ టీఆర్పీ రేటింగ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలకు కూడా ఈ తరహా రికార్డు సాధ్యం కాలేదు. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ అయిన ఈ సినిమాకు ఏకంగా 15.92 రేటింగ్ నమోదైంది. ఈ రేటింగ్ కేవలం జీ తెలుగు ఎస్‌డీ ఛానెల్స్‌కి సంబంధించిందే. ఇక జీ తెలుగు హెచ్‌డీలో 2.3 రేటింగ్ సొంతం చేసుకుంది. మొత్తంగా 18కిపైనే రేటింగ్ నమోదైంది.

READ MORE: Sailesh Kolanu: “నా సినిమా సేఫ్..” కోర్ట్ సినిమాపై ‘హిట్‌ 3’ దర్శకుడు ఆసక్తికర పోస్ట్‌..

ఇక ఓటీటీలోనూ “సంక్రాంతికి వస్తున్నాం” నూతన రికార్డును సృష్టించింది. జీ5 ఓటీటీలో మార్చి 1 సాయంత్రం 6 గంటలకు స్ర్టీమింగ్ ప్రారంభమైంది. మొదటి 12 గంటల్లోనే ఏకంగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేసింది. ఆర్ఆర్ఆర్, హనుమాన్ లాంటి సినిమాల రికార్డులను బద్ధలుగొట్టింది. స్ట్రీమింగ్ మినట్స్ పెరుగుతూనే ఉన్నాయి. 200 మిలియన్లు, 300 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. జీ5 ఓటీటీలో నంబర్ వన్ ట్రెండింగ్ మూవీగా సరికొత్త రికార్డు సృష్టించింది.

Exit mobile version