వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకున్న విషయం తెలిసిందే.