బంగ్లాదేశ్‌పై భారత్‌కు గొప్ప ఆరంభం లభించింది. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ.. సంజు శాంసన్ టీమ్ ఇండియాకు శుభారంభం అందించాడు. శాంసన్ 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 13.4 ఓవర్ వద్ద ముస్తాఫిజుర్ బాలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మొత్తం 47 బంతుల్లో 111 రన్స్ పూర్తి చేశాడు శాంసన్. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతంగా రాణించాడు. కెప్టెన్ 34 బాల్స్‌లో 75 రన్స్ చేశాడు. మహ్మదుల్లా బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఓటయ్యాడు.
సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయదుందుభి మోగించింది. తాజాగా టీంలో మార్పు చోటుచేసుకుంది. పేసర్ అర్ష్‌దీప్ స్థానంలో రవి బిష్ణోయ్‌కి అవకాశం దక్కింది. వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా హర్షిత్ రాణా మూడవ టీ20కి హాజరుకాలేదు. ఈ మేరకు బీసీసీఐ సమాచారం ఇచ్చింది. హర్షిత్ కు ఇన్ ఫెక్షన్ సోకడంతో హోటల్ నుంచి స్టేడియానికి రాలేకపోయాడు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దసర పండగ రోజు విజయాల జోరు కొనసాగించేందుకు టీమిండియా కుర్రాళ్లు సై అంటున్నారు. ఇప్పటికే 250 దాటింది.