NTV Telugu Site icon

JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తప్పిన ప్రమాదం

Jp Nadda

Jp Nadda

JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తృటిలో ప్రమాదం తప్పింది. పుణెలోని ఓ వినాయక మండపంలో దర్శనానికి వెళ్లిన సమయంలో ఆలయ మండపం పైభాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. జేపీ నడ్డా ఆర్తి కోసం వచ్చిన సమయంలో సానే గురూజీ తరుణ్ మిత్ర మండల్ వినాయక మండపం పైభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో వెంటనే జేపీ నడ్డాను సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది.

Also Read: ISRO Chief: రాకెట్లలో ఉపయోగించే విడిభాగాలు భారత్‌కు చెందినవే..

ఉజ్జయిని మహాకాళ్ టెంపుల్ మోడల్‌లో సానే గురూజీ తరుణ్ మండల్ రూపొందించిన ఈ గణపతి పండల్ పైభాగంలో మంటలు చెలరేగడంతో నడ్డా ఆరతిని సగంలోనే వదిలేసి బయటకు రావాల్సి వచ్చింది. అయితే వర్షం రావడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. టపాసులు పేలుస్తుండగా నిప్పురవ్వలు ఎగిసి పడడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.