Sandy Master: కొరియోగ్రాఫర్ సాండీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన అతను, లియో సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్య మలయాళంలో వచ్చి సూపర్ హిట్ అయిన కొత్తలోక సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఆయన తాజాగా కిష్కింధపురి అనే సినిమాలో విలన్ పాత్రలో నటించి, ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తెలుగు మీడియా ప్రతినిధులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో చిన్నప్పుడు తన కళ్ళను చూసి స్నేహితులు స్కూల్లో ఎగతాళి చేసేవారని చెప్పుకొచ్చాడు.
READ MORE: OG : ఓజి ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టిన ప్రియాంక మోహన్
తన కళ్ళు చనిపోయిన మేక కళ్ళలా ఉండేవని అనేవారని, అయితే ఇప్పుడు ఆ కళ్ళను చూసే తనకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చాడు. అంతేకాక, తెలుగులో ఓంకార్ నిర్వహించిన ఛాలెంజ్ షోలో తాను డాన్సర్‌గా ఒక సీజన్‌లో పాల్గొన్నానని వెల్లడించాడు. అంతేకాక, తమిళంలో బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్‌గా కూడా నిలిచానని అన్నాడు. తాను బిగ్ బాస్ హౌస్‌లో చాలా కామెడీ పండించినా, అందుకు భిన్నంగా తనకు లియోలో చాక్లెట్ కాఫీ అనే ఒక సైకిక్ క్యారెక్టర్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలో చూసిన తనకు కొత్తలోక, అలాగే ఇప్పుడు కిష్కింధపురి సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు వెల్లడించాడు.
READ MORE: Group 1 Controversy: నాకు కాబోయే భార్య గోల్డ్‌మెడలిస్ట్.. గ్రూప్1 ర్యాంక్ తెచ్చుకుంది.. కానీ…