దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు.. ఊహించని రేంజ్ లో అర్జున్ రెడ్డి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది.ఇక ఈ సినిమాను సందీప్ హిందీలో కబీర్ సింగ్ పేరు తో రీమేక్ చేసి అక్కడా భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకున్న సందీప్ రీసెంట్ గా యానిమల్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకున్నాడు.బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల కు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ తో మరోసారి డైరెక్టర్ సందీప్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది.
సందీప్ తర్వాతి చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. వీరిద్దరి కాంబోలో స్పిరిట్ అనే మూవీ రాబోతుంది.. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ తో మూవీ చేయబోతున్నట్లు సందీప్ ప్రకటించాడు. వీరిద్దరే కాకుండా తన ఫేవరేట్ హీరోతో సినిమా చేయాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టాడు. ఇంతకీ సందీప్ ఫేవరేట్ హీరో ఎవరో కాదు..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..రీసెంట్‌గా మహబూబా బాద్ జిల్లా.. దంతాలపల్లికి వెళ్లిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అక్కడ తనకు బాగా కావాల్సిన వారితో తన మనసులో మాట చెప్పాడు. బాస్ మెగాస్టార్ చిరంజీవితో మాత్రమే కాదు లిటిల్ బాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కూడా సినిమా తీసేందుకు ఎంతగానో వెయిట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు.త్వరలోనే సందీప్ అదిరిపోయే కథ తో రామ్ చరణ్ ను కలవనున్నట్లు సమాచారం.