యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం అన్ని అడ్డంకులను దాటి ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చింది. నేడు ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ విడుదలకు ముందే హిట్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయడంతో మూవీ రిజల్ట్ తెలిసిపోయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మేకర్స్ అంతా సంతోషించారు.హార్రర్ ఫాంటసీ అడ్వెంచర్గా వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ అందుకుంటుంది. కొంతకాలంగా సరైన హిట్ లేని సందీప్ కిషన్ కి ఈ చిత్రం హిట్ టాక్ మంచి ఊరటను ఇచ్చింది.
రిలీజ్ కి ముందు ఈ చిత్రానికి లీగల్ అడ్డంకులు వచ్చిన విషయం తెలిసిందే. అయినా కూడా సందీప్ కిషన్ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కూడా బాగానే వచ్చాయని తెలుస్తుంది. ఈ క్రమంలో ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ఓటీటీ పార్ట్నర్ మరియు రైట్స్ ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ మొత్తంలో ఈ మూవీ డిజిటల్ హక్కులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. కానీ, త్వరలోనే ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్, స్ట్రిమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఏ మూవీ అయినా థియేట్రికల్ రన్ అనంతరం రెండు నెలల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనేది ఒప్పందం వుంది.. కాబట్టి ఈ సినిమా థియేట్రికల్ రన్ అనంతరం రెండు నెలలు లేదా 45 రోజుల తర్వాత ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది. ఆ లెక్కన చూస్తే ‘ఊరు పేరు భైరవకోన’ ఎప్రిల్ రెండో వారం లేదా మార్చి చివరిలోనే ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది