టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత మూడు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు అన్ని మంచి హిట్ ను సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరింది.. తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది.. తాజాగా బాలీవుడ్ లో కూడా ఛాన్స్ పట్టేసిందని ఓ వార్త సంచలనంగా మారింది..
ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజుకు వెళ్లింది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ లక్కీ హీరోయిన్ గా మారింది.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది సంయుక్తమీనన్. గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సంయుక్త మూవీలో ఉంటే హిట్ అనే సెంటిమెంట్ ఉండండతో ఆఫర్ల జోరు పెరిగింది.. తెలుగులోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది..
ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. విరూపాక్ష తర్వాత కళ్యాణ్ రాం తో డెవిల్ లో నటించింది. ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభు లో నటిస్తోంది. బాలీవుడ్ లో మహారగ్ని మూవీలోనూ ఛాన్స్ దక్కించుకుంది.. అలాగే మలయాళం లో కూడా వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది.. అందంతో , నటనలో ఫుల్ మార్క్స్ కొట్టేసిన సంయుక్త మీనన్ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటోంది…’భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ సినిమాలు తన లిస్ట్ లో ఉన్నాయి.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..