మిడ్ రేంజ్ బడ్జెట్‌లో కొత్త స్మార్ట్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. భారత్ లో Samsung Galaxy M36 లాంచ్ అయింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎంట్రీ లెవల్ మిడ్ రేంజ్ బడ్జెట్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 20 వేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లో వస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ఉంది. ఈ ఫోన్‌లో 50MP కెమెరా, ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ఉన్నాయి.
Also Read:India Bangladesh: బంగ్లాదేశ్‌ని దారుణంగా శిక్షించిన మోడీ సర్కార్.. ఏం చేసిందంటే..
ఈ స్మార్ట్‌ఫోన్ మూడు కాన్ఫిగరేషన్‌లలో లాంచ్ చేశారు. Samsung Galaxy M36 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ డిస్కౌంట్ తర్వాత రూ.16,499 కు లభిస్తుంది. ఈ ఫోన్‌పై రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 21,999. ఈ అన్ని వేరియంట్లపై రూ. 1000 తగ్గింపు లభిస్తోంది. మీరు ఈ ఫోన్‌ను సెరీన్ గ్రీన్, వెల్వెట్ బ్లాక్, ఆరెంజ్ హేజ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. జూన్ 12 నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read:Kartik Maharaj: 6 నెలల్లో 12 సార్లు అత్యాచారం.. పద్మశ్రీ అవార్డు గ్రహీతపై ఆరోపణలు..
స్పెసిఫికేషన్లు
Samsung Galaxy M36 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+తో వస్తుంది. ఇది Exynos 1380 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 8GB RAM ఆప్షన్స్ తో 256GB వరకు స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ UI 7 పై పనిచేస్తుంది. ఇందులో గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్, AI సెలెక్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6 సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను పొందుతుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో, కంపెనీ 13MP సెల్ఫీ కెమెరాను అందించింది. 5000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భద్రత కోసం, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, Samsung Knox Vault అందుబాటులో ఉన్నాయి.