Samsung Fab Grab Fest Sale 2024 Date and Discounts Details: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్’ క్రేజీ సేల్‌కు సిద్ధమైంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ‘శాంసంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్’ 2024 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు, గెలాక్సీ బుక్‌లు, ట్యాబ్‌లు, యాక్సెసరీలు, టీవీలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు అందిచనున్నట్లు పేర్కొంది. స్మార్ట్‌ఫోన్లపై గరిష్ఠంగా 53 శాతం వరకు రాయితీ పొందొచ్చని వెల్లడించింది. సెప్టెంబర్ 26 నుంచి డీల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే ఎప్పటి వరకు ఈ ఆఫర్లు ఉంటాయనే విషయాన్ని మాత్రం శాంసంగ్ వెల్లడించలేదు.
శాంసంగ్ వెబ్‌సైట్, శాంసంగ్ షాప్ యాప్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల ద్వారా చేసే కొనుగోళ్లపై మాత్రమే ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. డిస్కౌంట్ ఆఫర్‌లతో పాటు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, లాప్‌ట్యాప్‌లను ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 40 శాతం (రూ.15000 వరకు) వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. శాంసంగ్ స్మార్ట్‌టీవీలపై 22.5శాతం (రూ.25000 వరకు) వరకు క్యాష్‌బ్యాక్ అందించనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ సహా ఎస్‌బీఐతో పాటు ఎంపిక చేసిన క్రెడిట్/ డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారు ఈ తగ్గింపు పొందొచ్చు.
గెలాక్సీ జెడ్ సిరీస్, గెలాక్సీ ఎస్ సిరీస్, గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లు 53 శాతం వరకు తగ్గింపును పొందవచ్చని శాంసంగ్ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 కొనుగోలు చేసిన వారికి ఎఫ్‌ఈ ఇయర్‌బడ్స్‌పై రూ.1,249 వరకు తగ్గింపు అందించనుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, గెలాక్సీ ఎస్24 సిరీస్, గెలాక్సీ ఎస్23 సిరీస్, గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ, గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35, గెలాక్సీ ఎం35, గెలాక్సీ ఎం15, గెలాక్సీ ఎఫ్55 ఫోన్లు ఈ డీల్స్‌లో ఉన్నాయి.
గెలాక్సీ బుక్ 4 సిరీస్‌పై 27శాతం తగ్గింపు ఉంది. గెలాక్సీ బుక్ 4 మోడల్ కొనుగోలు చేసిన వారికి హెచ్‌డీ ఫ్లాట్ మానిటర్‌పై రూ.1,920 తగ్గింపు లభించనుంది. గెలాక్సీ ట్యాబ్ ఏ9, ఎస్9 సిరీస్‌లపై గరిష్ఠంగా 74 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇవేకాకుండా శాంసంగ్ తన రిఫ్రిజిరేటర్‌లు, వాషింగ్ మెషీన్‌లు, మైక్రోవేవ్‌లు, మానిటర్‌లపై కూడా భారీగా తగ్గింపులను అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం శాంసంగ్ సైట్‌ను చెక్ చేయండి.