Sameer Rizvi Double Century: భారత్‌లో ఒకవైపు విజయ్ హజారే ట్రోఫీ ఉత్కంఠ భరితంగా కొనసాగుతుండగా.. మరోవైపు, అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో సమీర్ రిజ్వీ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. శనివారం (డిసెంబర్ 21)వ తేదీ శనివారం జరిగిన ఉత్తరప్రదేశ్, త్రిపుర జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. సమీర్ రిజ్వీ అజేయంగా 201 పరుగులు చేసి ఈ స్కోరుకు ముఖ్యమైన భాగాన్ని అందించాడు. ప్రత్యర్థి త్రిపుర జట్టు భారీ స్కోర్ ను చేధించే క్రమంలో 253 పరుగులకే ఆలౌట్ అయ్యి 152 పరుగుల తేడాతో ఓడిపోయింది. త్రిపుర జట్టులో ఆనంద్ భౌమిక్ 68 పరుగులతో కాస్త ప్రతిఘటించగలిగాడు.
Also Read: Copper IUD: లైంగిక జీవితంపై కాపర్ టీ ప్రభావం ఎంతవరకు ఉంటుందో తెలుసా?
ఇకపోతే, ఈ మ్యాచ్ లో సమీర్ రిజ్వీ కేవలం 97 బంతుల్లో 13 ఫోర్లు, 20 సిక్సర్లతో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో సమీర్ దేశవాళీ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ లిస్ట్-ఎ క్రికెట్‌లో ప్రస్తుతం ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బోవ్స్ పేరిట ఉంది. అతను 103 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. అదే విధంగా ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ 114 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన వారిలో ఒకడు.
THE SAMEER RIZVI SHOW. 🤯
– 201* (97) with 13 fours and 20 sixes, smashing the fastest double century in Men's U23 State A Trophy. pic.twitter.com/SNNheU6WlP
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2024
Also Read: Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. కిక్కిరిసిన స్టేడియం
సమీర్ రిజ్వీ ఐపీఎల్ 2024 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, మెగా వేలానికి ముందు సీఎస్‌కే అతడిని విడుదల చేయడంతో ఈ సారి జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కేవలం రూ. 95 లక్షలకు తీసుకుంది. ఐపీఎల్ 2025లో సమీర్ తన ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముఖ్యమైన ఆటగాడిగా మారే అవకాశం ఉంది. సమీర్ రిజ్వీ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో అతను 153 పరుగులతో ఒక ఇన్నింగ్స్ ఆడగా, మరో మ్యాచ్‌లో 137 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఫామ్‌ను కొనసాగిస్తే.. అతడు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా ప్రభావం చూపగలడు.