Samantha Temple : సెలబ్రిటీలకు అభిమానులు ఉండడం సహజం. అది సినీ ఇండస్ట్రీ, రాజకీయాల్లోనైనా సరే. కొంత మంది అభిమానులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు వారి కోసం ఏమైనా చేస్తారు. ఎందుకంటే అభిమానులకు వారే దేవుళ్లు. ఈ క్రమంలోనే వారిని పూజిస్తారు కూడా. అవసరమైతే వారి కోసం గుడి కూడా కట్టేస్తారు. గతంలో కూడా నటీమణులు ఖుష్బు, హన్సికకు వారి ఫ్యాన్స్ గుడికట్టారని వార్త విన్నాం. తాజా వారి జాబితాలో సమంత చేరిపోయారు. సమంతకు కూడా ఆమె వీరాభిమాని గుడి కట్టిస్తున్నారు.
Read Also: Kidney Racket: విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. పేదవాళ్లను లక్ష్యంగా చేసుకుని దందా!
గతేడాది మైయోసైటిస్ బారిన పడి ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్.. సమంత పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు వినూత్నమైన గిఫ్ట్ ఇవ్వనున్నారు. తన ఇంట్లో విగ్రహం తయారు చేసి గుడి కడుతున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండ్ అవుతోంది. ఇది కాకుండా, సమంత అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వ్యాధి నుండి కోలుకోవాలని ఇప్పటికే తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడప దర్గాలకు పాదయాత్ర నిర్వహించినట్లు సందీప్ తెలిపారు. ఈ నెల 28న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆలయాన్ని తెరవనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది.
Read Also: Drunkard: పెళ్లి చేసుకునేందుకు పిల్ల దొరకట్లేదు.. బట్టలు విప్పి హల్ చల్