Samantha : సినిమాల్లో నటించే వాళ్లకు చదువు అబ్బదని విష ప్రచారం ఉంది. కానీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో కూడా చదువులో గొప్పగా రాణించిన వాళ్లు చాలామందే ఉన్నారు. నటి సాయి పల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఓవైపు చేస్తూనే మరోవైపు సినిమాల్లో రాణిస్తున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చదువులోనూ ముందుండేవాడు. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ మరీ సుశాంత్ సినిమాల కోసం ప్రయత్నించాడు. అంతే కాకుండా సుశాంత్ ఇంట్లో ఉండి కోడింగ్ నేర్చుకున్నాడు. అదేవిధంగాఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా చదువులో టాలెంటెడ్ స్టూడెంట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత స్కూల్ మార్కుల రిపోర్ట్ కార్డు మరోసారి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ రిపోర్ట్ కార్డులో సమంత సాధించిన మార్కులు చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు.
Read Also: Dharmapuri Issue: తెరుచుకున్న స్ట్రాంగ్‌రూమ్.. 26న హైకోర్టుకు నివేదిక
సమంత 10వ తరగతిలో 1000 మార్కులకు 887 మార్కులు సాధించింది. సమంత మ్యాథమెటిక్స్‌లో 100/100, ఫిజిక్స్‌లో 95/100 మార్కులు సాధించింది. ఇంగ్లీషులో 90, బోటనీలో 84, హిస్టరీలో 91, జాగ్రఫీలో 83 మార్కులు సాధించి తన భాష (తమిళం) పేపర్‌లో 88 మార్కులు సాధించింది. అన్ని సబ్జెక్టులను సమంతకు 80 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. సమంత 2001- 2002 లో చెన్నైలోని హోలీ ఏంజిల్స్ స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకుంది. అంతే కాకుండా సమంత డిగ్రీ 2007లో పూర్తి చేసింది. సమంత చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్ లో బీకాం గ్రూప్ తీసుకుని డిగ్రీ పూర్తి చేసింది. ఇక పదవ తరగతి లోనే కాకుండా డిగ్రీలోనూ సమంత చదువులో రాణించింది. కానీ సమంత నటన పై ఉన్న ఆసక్తి తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక చదువుకొనే కాదు నటనలోనూ తాను గ్రేట్ అని నిరూపించుకుంది.
Read Also:Rajini’s 170th film : వచ్చే నెల సెట్స్ పైకి రజినీ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
అంతకుముందు, 2020 సంవత్సరంలో కూడా ఇదే మార్క్‌షీట్ వైరల్ అయింది. వైరల్ రిపోర్ట్ కార్డ్ పోస్ట్‌పై సమంత టీచర్ .. “ఆమె బాగా చదివేది. తను పాఠశాలకు ఒక ఆస్తి. ” అని అన్నారు. రిపోర్ట్ కార్డ్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ కావడం పట్ల సమంత రూత్ ప్రభు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె “హా హ ఇది మళ్లీ వైరల్ అవుతోంది” అని కామెంట్ చేశారు. ఈ మార్క్‌షీట్‌ను రాగల్‌హరి అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ అయింది. “టాపర్ ప్రతిచోటా టాపర్. సమంత ప్రతి పాత్రలోనూ పర్ఫెక్ట్‌గా నటించింది. అది స్టూడెంట్ గా, కుమార్తెగా, నటుడిగా, భార్య మరియు కోడలుగా. సమంత కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. సమంత చివరిగా పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ చిత్రంలో కనిపించారు. మేనక, విశ్వామిత్రల కుమార్తె శకుంతల టైటిల్ పాత్రలో సమంత నటించింది. ఈ సినిమాలో దేవ్ మోహన్ హీరోగా చేశారు. దీనికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇది ఏప్రిల్ 14న బాక్సాఫీస్ వద్ద విడుదలైంది, కానీ అది సరైన హిట్ అందుకోలేకపోయింది.