NBK 109 :నటసింహం నందమూరి బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించింది.ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా “NBK109 ” వర్కింగ్ టైటిల్ పై తెరకెక్కుతుంది.ఈ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.అయితే బాలయ్య మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీ గా వుండి షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు.ఎన్నికలు ముగియడంతో బాలయ్య మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మరియు టీజర్ ను జూన్ 10 బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో సలార్ బ్యూటీ శ్రియారెడ్డి విలన్ గా నటిస్తున్నదని సమాచారం.తాజా షెడ్యూల్‌లోనే బాలయ్య మరియు శ్రియారెడ్డిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం.. ‘సలార్’లో ‘రాధారమా మన్నార్’గా పవర్‌ఫుల్ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలందుకున్న శ్రియారెడ్డి బాలయ్యకు ధీటైన పాత్రలో నటిస్తుంది.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.