పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22 న క్రిస్మస్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు ఆరేళ్లుగా మరో భారీ హిట్ కోసం ప్రభాస్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. దీనితో తాజా సినిమా సలార్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.సలార్ పై హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు..ముఖ్యంగా నార్త్ లో సలార్ మంచి వసూళ్లు సాధించడం చాలా కీలకం. అందుకే మేకర్స్ దీనిపై ప్రత్యేకం గా దృష్టి సారించారు. ఈసారి సలార్ లో ప్రభాస్ కు శరద్ కేల్కర్ తో డబ్బింగ్ చెప్పించారు.
చివరి సారి బాహుబలి 2 లో కూడా అతడే ప్రభాస్ కు గళం అందించాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నార్త్ లో వసూళ్ల వర్షం కురిపించింది.ఈ మధ్యే వచ్చిన ఆదిపురుష్ హిందీ వెర్షన్ లో ప్రభాస్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. నిజానికి ఈ సినిమాలో యాక్టర్స్ అంతా బాగానే కష్టపడినా.. రామాయణాన్ని చూపించిన తీరు , వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను నిరాశ కు గురి చేసింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా దారుణం గా బోల్తా పడింది. దీంతో సలార్ మూవీలో ప్రభాస్ పర్సనాలిటీ సూటయ్యే శరద్ కేల్కర్ వాయిస్ తో నార్త్ అభిమానులను ఆకర్షించడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.బాహుబలి మరియు బాహుబలి 2 రెండు సినిమాల్లో కూడా శరద్ కేల్కరే ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పాడు. దీంతో ఈసారి కూడా మ్యాజిక్ రిపీట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు..ఇప్పటికే శరద్ తన డబ్బింగ్ పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సలార్ రిలీజ్ సమయంలోనే షారుక్ ఖాన్ డంకీ మూవీ కూడా విడుదల కాబోతోంది. దీంతో క్రిస్మస్ కు ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వార్ కు సిద్ధమవుతున్నారు.