ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా సలార్.. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు.. ఈ మూవీని చూసేందుకు అడియన్స్ తెగ ఆరాటపడుతున్నారు. భారీ బడ్జెట్తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు.
ఇందులో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ వచ్చే నెల 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. దాంతో ఈ హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలోట్రెండ్ అవుతుంది.. ఇక సలార్ కోసం త్వరలోనే ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారట హోంబలే ఫిల్మ్స్. అటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సలార్ ఈవెంట్స్ జరగనున్నాయని.. అలాగే అన్ని భాషల మీడియాతో ప్రభాస్ ఇంట్రాక్ట్ కానున్నాడని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటు సలార్ ప్రమోషన్స్ షూరు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో సలార్ టీ షర్ట్స్ సందడి చేస్తున్నాయి..
డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఆన్ లైన్ లో వీటిని విక్రయిస్తున్నారు. హోంబలే వెర్సెస్ వెబ్ సైట్లో ఈ షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. టీషర్ట్, హూడీ, హార్మ్ స్లీవ్స్ కొనుగోలు చేయవచ్చు. టీషర్ట్స్ కావాలనుకున్న ఫ్యాన్స్ హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..రూ.499 నుంచి ప్రారంభమై రూ.1499 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇందులో ప్రభాస్ మాస్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను రెండు భాగాలుగా తీసువస్తున్నారు. గతంలో బాక్సాఫీస్ ను షేక్ చేసిన కేజీఎఫ్ చిత్రానికి సలార్ మూవీకి లింక్ ఉంటుందని అంటున్నారు ప్రేక్షకులు.. డుంకి సినిమాతో పోటి పడుతుంది.. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి..
Rebel fans, this one’s for you! 💥#HombaleVerse presents the Inaugural Offer – Buy one get one FREE on #Salaar exclusive merchandise.
– https://t.co/T9sVOpd3h2 @hombalefilms #SalaarStyle #SalaarMerchandise#SalaarCeaseFire #SalaarCeaseFireOnDec22 pic.twitter.com/QXeC9TAzE6— Hombale Films (@hombalefilms) November 25, 2023