Shocking Murder: అక్రమ సంబంధానికి అడ్డు వస్తాడని కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య తనను వదిలి వెళ్లిపోయిందని ఆమె చెల్లిని రెండో వివాహం చేసుకున్నాడు ఆయన. ఆమెకు పిల్లలు పుట్టడం లేదని ఆమె చెల్లిని మూడో వివాహం చేసుకున్నాడు. కట్ చేస్తే మూడో భార్య చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఇంతకీ మూడో భార్యను ఎవరు పట్టించారని అనుకుంటున్నారు. స్వయానా వాళ్ల రెండో అక్క ఇచ్చిన ఫిర్యాదే.
READ ALSO: Chiranjeevi: దుఃఖంలో అరవింద్ ఫ్యామిలీకి అండగా చిరు
అక్రమ సంబంధం 60 ఏళ్ల వృద్ధుడిని బలితీసుకుంది..
సకారియాకు చెందిన భైలాల్ రాజక్ అనే వ్యక్తికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య ఆయనను విడిచి వెళ్లిపోవడంతో తరువాత ఆయన ఆమె సోదరి గుడ్డి బాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టకపోవడంతో, ఆమె చెల్లెలు మున్నీ బాయిని వివాహం చేసుకున్నాడు. తరువాత ఆమె వారి ఇంటికి భూమి ఒప్పందాల కోసం తరచుగా వారి ఇంటికి వచ్చే ఆస్తి బ్రోకర్ అయిన లల్లు కుష్వాహాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. వాళ్లిద్దరూ కలిసి జీవించాలని ప్లాన్ చేసుకున్నారు. భైలాల్ బతికి ఉండటం వారికి ఒక అడ్డంకిగా మారింది. దీంతో వాళ్లు ఆయనను అంతమొందించడానికి ప్లాన్ చేశారు. ఆగస్టు 30న రాత్రి, భైలాల్ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా, లల్లు, ధీరజ్ లోపలికి ప్రవేశించి ఇనుప రాడ్‌తో అతనిని కొట్టి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, కట్టి, ఒక సంచిలో వేసి, సమీపంలోని బావిలో పడేశారు. రెండో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఈసందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. పోలీసులు బావిలోని ఆయన మృతదేహాన్ని బయటికి తీసి, మృతుడి మొబైల్ ఫోన్, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో మొబైల్ ఫోన్ కీలకమైనది. మృతుడి మూడవ భార్య మున్నీ, ఆమె ప్రియుడు నారాయణ్ దాస్ కుష్వాహా, హత్యకు వాళ్లకు సహాయం చేయడానికి నియమించబడిన కార్మికుడు ధీరజ్ కోల్ హత్య చేసినట్లు గుర్తించి ముగ్గురిని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. హత్య కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని డీఐజీ సవితా సోహానే (షాడోల్ రేంజ్), ఎస్పీ మోతీ ఉర్ రెహమాన్ ప్రశంసించారు.
READ ALSO: Shocking Incident: ఏమైంది ఆ తల్లికి .. 15 రోజుల బిడ్డ విషయంలో ఎందుకలా చేసింది!