Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Sajjala Ramakrishna Reddy Sensational Comments On Chandrababu

Sajjala Ramakrishna Reddy: టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ.. వణుకు మొదలైంది..!

Published Date :August 24, 2023 , 3:44 pm
By Sudhakar Ravula
Sajjala Ramakrishna Reddy: టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ.. వణుకు మొదలైంది..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Sajjala Ramakrishna Reddy: టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైఎస్‌ జగన్ దీనికి పూర్తి విరుద్ధం అన్నారు. నిజాయితీగా రాజకీయం చేయటమే జగన్ కు వచ్చు.. 60 లక్షల ఓట్లు ఎవరివో తెలియని పరిస్థితి ఉంది.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళాలని మేం భావించాం.. ఈ విషయం జగన్ చెప్పిన వెంటనే చంద్రబాబులో వణుకు మొదలైందని విమర్శించారు. టీడీపీ మా సానుభూతి ఓటర్లను పెద్ద ఎత్తున తీయించిందని ఆరోపించిన ఆయన.. సున్నా డోర్ నెంబర్ తో అనేక ఓట్లు ఉన్నాయి.. ఓకే ఇంటి నెంబర్ పై 700 ఓట్లు ఉన్నాయి.. ఇవన్నీ మేం బయటకు తీస్తున్నాం.. ఉరవకొండలో ఓట్ల రద్దును ఎన్నికల సంఘం తప్పు పట్టలేదు.. రద్దు ప్రక్రియను తప్పు బట్టింది.. దీనికి ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? అని ప్రశ్నించారు.

2015, 2016, 2017 లో 50 లక్షలకు పైగా ఓట్లను తీయించాం.. సేవామిత్రా అనే యాప్ ద్వారా సేకరించిన సమాచారాన్ని బ్లూ ఫ్రాగ్ అనే ప్రైవేటు సంస్థకు టీడీపీ ప్రభుత్వం అప్పగించింది.. బ్లూ ఫ్రాగ్ కు, ఐటీ గ్రిడ్ కు మధ్య సంబంధం ఉంది అని ఆరోపించారు సజ్జల.. అక్కడి నుంచి ఓటర్‌ను గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టారన్న ఆయన.. ఎవరు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఏ టీవీ ఛానెల్ చూస్తారు వంటి మొత్తం సమాచారం సేకరించారిని విమర్శించారు. మా పార్టీ ఎంపీలు కూడా ఎన్నికల సంఘానికి వెళ్లి ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నారు. దొంగ ఓట్లను పూర్తిగా తీసేయమని అడుగుతామని తెలిపారు. ఇక, చంద్రబాబు ఏజెంట్లు అందరూ ఆర్కెస్ట్రా లా మాట్లాడతారు అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ కూడా అధికారంలోకి దొంగ ఓట్లతో వచ్చిందా? అని ప్రశ్నించారు. దొంగ ఓట్లను తీయించలేని పరిస్థితిలో ఈసీ ఉందని బండి సంజయ్ చెప్పదలుచుకున్నారా? అని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Also Read

  • RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్‌
  • Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. విజయ్‌ అభిమానుల్లో తీవ్ర ఆవేదన.. ఆత్మహత్యాయత్నం కలకలం
  • Mamata Banerjee: 'మాజీ' అని పెట్టుకోను.. మమతా బెనర్జీ 'X' బయోలో తెలివైన మార్పు!
  • Google Fitbit Air: మీ మెడికల్ రిపోర్టులను విశ్లేషించే AI కోచ్.. గూగుల్‌ నుంచి స్క్రీన్ లేని వినూత్న ఫిట్‌నెస్ ట్రాకర్ ..
Add as a preferred
source on google

ఓటర్ల జాబితాలో అవకతవకల జరుగుతున్నాయని టీడీపీ, వాళ్ల మీడియా ఆరోపిస్తోంది.. ఉరవకొండలో ఓట్ల తొలగింపులో సరైన విధానాన్ని పాటించలేదనే కారణంతో ఇద్దరు అధికారులను తొలగించారని తెలిపారు సజ్జల..అదేదో పెద్ద విషయం అన్నట్లు చిత్రీకరిస్తున్నారు.. దొంగే దొంగ అన్నట్లు ఉంది. పతివ్రత ఆరోపణల్లా ఉన్నాయి అంటూ ఎద్దేవా చేశారు. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారనే అనుమానాలు ఎవరికైనా కలుగుతాయన్న ఆయన.. టీడీపీ గోబెల్స్ ప్రచారాన్ని ఖండించకపోతే నిజం అని నమ్మే అవకాశం ఉందన్నారు. అసలు బాధితులం మేమే.. మాకు వేరే విద్యలు రావు.. గోడలు దూకటం, అడ్డదారులు వేయటం టీడీపీకి అలవాటు.. టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు.. జగన్ దీనికి పూర్తి విరుద్ధం అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • sajjala ramakrishna reddy
  • tdp
  • YSRCP

తాజావార్తలు

  • Vladimir Putin: పుతిన్‌కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!

  • Kakarla Krishna : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!

  • RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్‌

  • Rohit Sharma Lady Fan: అభిమాని కోసం వెయిట్ చేసిన రోహిత్ శర్మ.. తబ్బిబైపోయిన యువతి, వీడియో వైరల్!!

  • Irumudi: రవితేజ ‘ఇరుముడి’ షూటింగ్ అప్‌డేట్..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions