Sajjala Ramakrishna Reddy: టీడీపీ, వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్!
- 'చంద్రబాబు మోసానికి రెండేళ్లు' పేరుతో ప్రత్యేక సమావేశం
- గొడ్డలి పార్టీ అంటూ కొత్త డ్రామా మొదలెట్టారు
- చంద్రబాబు పాలిట వైఎస్ జగన్ గొడ్డలి, త్రిశూలం కూడా
- చంద్రబాబు చీఫ్ మినిష్టర్ కాదు, చీటింగ్ మాస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేంద్ర కార్యాలయంలో ‘చంద్రబాబు మోసానికి రెండేళ్లు’ పేరుతో నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో మహిళలకు ఇచ్చిన హామీల అమలు, మహానాడులో చేసిన ప్రకటనలు, ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మహిళా మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ అంటూ సీఎం చంద్రబాబు కొత్త డ్రామా మొదలెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు పాలిట వైఎస్ జగన్ గొడ్డలి, త్రిశూలం కూడా అని పేర్కొన్నారు. చంద్రబాబు చీఫ్ మినిష్టర్ కాదు, చీటింగ్ మాస్టర్ అని విమర్శించారు. హామీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం పెట్టారని ఎద్దేవా చేశారు. మొన్న జరిగింది మహానాడు కాదు, లోగ్రేడ్ మహానాడు అన్నారు. టీడీపీకి, వైసీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ బోత్ ఆర్ నాట్ సేమ్ అని.. టీడీపీ, వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్ అని సజ్జల చెప్పుకొచ్చారు.
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
‘ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసింది వ్యవస్థీకృత అరాచకపాలన. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది మహిళలే. వైఎస్ జగన్ ఐదేళ్లలో మహిళలకే పెద్దపీట వేశారు. చంద్రబాబు మోసం చేసి పుండుమీద కారం చల్లుతున్నారు. జగన్ కంటే ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చి ఉన్నవి కూడా పీకేశాడు. చంద్రబాబుకు, జగన్‌కు ఎంతో వ్యత్యాసం ఉంది. అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేయాలనేది జగన్ ఆలోచన.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం బాధ్యతగా జగన్ భావించారు. కానీ చంద్రబాబు ఏం చేయకుండానే సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చేశానంటున్నాడు. ఇప్పుడు పిల్లలే సంపద, పిల్లల్నికనండి అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు ఇంటి నుంచే ఎందుకు మొదలుపెట్టరు’ అని సజ్జల ప్రశ్నించారు.
‘నెలకు 1500 ఆడబిడ్డ నిధి హామీని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ముగ్గుర్ని కంటే 30 వేలు నలుగురిని కంటే 40 వేలు ఇస్తామంటున్నాడు. మాఫియా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు పాలన ఒక ఉదాహరణ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీనే కనిపిస్తోంది. చంద్రబాబుకు జగన్ గొడ్డలిలా కనిపిస్తున్నాడు. తనను రాజకీయంగా సమాధిచేయగల శక్తి జగన్ గారికే ఉందని చంద్రబాబుకు భయం. అందుకే పదే పదే గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రెండేళ్లలో జరిగిన దోపిడీని ప్రజలకు మనం వివరించాలి. ఆడబిడ్డ నిధి ఇస్తామని చంద్రబాబు చేసిన అతిపెద్ద మోసం. చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాలి. మా హామీల సంగతి ఏంటని చంద్రబాబు, లోకేష్, పవన్ ను ఎక్కడ కనబడినా అడగాలి’ అని సజ్జల అన్నారు.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!