NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోంది.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన జాబితాపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోందని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ దయనీయంగా మారారని.. చంద్ర బాబు ఏది పడిస్తే దానికి పవన్ తృప్తి పడడం అలవాటు అయ్యిందని ఎద్దేవా చేశారు. గతంలో రెండు చోట్ల పవన్ కల్యాణ్ ఓడిపోయారని.. వైసీపీని ఎందుకు గద్దె దించాలో కారణం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పలేకపోతున్నారని వెల్లడించారు. పవన్ కల్యాణ్ బలం లేదని ఒప్పుకుంటున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు జనసేనను మింగాలని అనుకుంటున్నారని ఆరోపించారు. జనసేన పార్టీ టీడీపీ అనుబంధ విభాగంగా మారిందన్నారు. కుప్పంలో కూడా వైసీపీ విజయం వైపు అడుగులు వేస్తోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read Also: Chandrababu: రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశాం..

పవన్ కల్యాణ్ అభిమానులను, సొంత సామాజిక వర్గం వారిని మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారన్నారు. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారని.. టీడీపీకి పవన్ కల్యాణ్ ఉపాధ్యక్షుడు అయితే బాగుంటుందన్నారు. ఎవరి మీద యుద్ధం చేస్తారు పవన్ కళ్యాణ్ అంటూ సజ్జల ప్రశ్నించారు. మేము మాత్రం ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని.. ముందు 24 సీట్లకు పవన్ కళ్యాణ్‌ను అభ్యర్థులను ప్రకటించమనండి అంటూ సవాల్ విసిరారు. పవన్ చిలకపలుకులు పలికితే సరిపోదు.. ఆయన గాలితో యుద్ధం చేయాల్సి ఉంటుందన్నారు.

LIVE: Sajjala Ramakrishna Reddy Reaction On TDP- Janasena's First List | NTV