Sajjala Ramakrishna Reddy: బాబు పాలన అంతా విధ్వంసమేనని, ప్రజలను ఇబ్బంది పెడతారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మళ్ళీ ఆయన తీరు బయటపడిందన్నారు. వాలంటరీల వ్యవస్థ పై ముందు నుంచే చంద్రబాబు కక్ష పెంచుకున్నారని అన్నారు. ఎన్నికల పేరుతో వాలంటరీ వ్యవస్థను ఆపాలని చంద్రబాబు పరోక్షంగా ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు. చంద్రబాబు స్వయంగా చెప్పవచ్చు.. వాలంటరీ వ్యవస్థ మంచిది కాదు అని.. జన్మభూమి కమిటీలు తెస్తామని.. కానీ ఇలా చంద్రబాబు దొంగ దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. వాలంటరీ వ్యవస్థపై చంద్రబాబు, దత్తపుత్రుడు ఆలోచన ఏంటో అందరికీ తెలుసన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను చంద్రబాబు పెట్టించారన్నారు. వాలంటరీల వ్యవస్థతో జగన్‌కు మేలు చేస్తారని చంద్రబాబు ఆలోచన అని.. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు లేఖలు రాయడం మొదలు పెట్టారన్నారు.
Read Also: CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..
సిటిజన్ ఫర్ డెమోక్రసి అనే సంస్థ వాలంటరీ వ్యవస్థపై సుప్రీం కోర్టుకు వెళ్లిందన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసి సంస్థను రమేష్ కుమార్ నడిపిస్తున్నారని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి చంద్ర బాబు, టీడీపీ ఏజెంట్ అని ఆరోపించారు. నాలుగేళ్లుగా పింఛన్‌ను ప్రతి నెలా ఒకటవ తేదీన ఇచ్చేవారు వాలంటీర్లు అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వేళ తప్పుదారి చంద్రబాబు అధికారంలోకీ వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీల అరాచకం ఉంటుందని విమర్శించారు. జగన్ పాదయాత్రలో ప్రజలు చెప్పిన సమస్యలను అధిగమించేందుకు వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ప్రజలకు ఎదైనా చేయాలనుకునే ఎవరికైనా వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. వాలంటరీ వ్యవస్థతో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయన్నారు. ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టే వ్యక్తి చంద్రబాబు అని.. జగన్ పెట్టిన వాలంటరీ వ్యవస్థ జనంకు మంచి చేసిందన్నారు. చంద్రబాబు కడుపు మంటతో ప్రజలకు అందే సేవలను నిలిపివేశారన్నారు.
Read Also: PM Modi: కీలమైన ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన కాంగ్రెస్.. ఆ పార్టీని నమ్మలేం..
ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని మళ్లీ చంద్రబాబు సీఎస్‌కు లేఖ రాశారన్నారు. పెన్షన్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందన్నారు. చంద్రబాబు సిటిజన్ ఫర్ డెమోక్రసి అనే సంస్థ ద్వారా వాలంటరీ వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. పెన్షన్‌లు ఆలస్యంగా రావడానికి చంద్ర బాబు కారణం అని ప్రజలు గుర్తించాలన్నారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎటు కాకుండా అయ్యిందన్నారు. పవన్ ఇక్కడే ఉంటా అని పిఠాపురంలో దీనంగా చెబుతున్నారన్నారు. జనసేనలో పోటీ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది చంద్రబాబు పంపిన వాళ్లేనన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసి సంస్థకు టీడీపీ, జనసేనలు రెండూ ఒక్కటేనన్నారు. బీజేపీ అభ్యర్థులు బయట నుంచి వచ్చిన వారు.. చంద్రబాబు పంపిన వాళ్లేనన్నారు. సొంత పార్టీ నేతల్ని చెడుగుడు ఆడారు చంద్రబాబు.. డబ్బుల కోసం చంద్రబాబు టికెట్లు ఇచ్చారన్నారు. వైసీపీ బీసీలకు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.