చంద్రబాబు ఎక్కడైనా రోడ్ల మీద మీటింగ్‌లు పెడుతున్నాడా??ట్రాఫిక్ ఎక్కడ ఉంటే అక్కడ మీటింగ్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్ళినప్పుడు కార్ మీద కూర్చుని హడావిడి చేశాడు. మాకు రూల్స్ వర్తించవు అనే బ్యాచ్ వీళ్ళు . ప్రభుత్వ విధానాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిది. జగనన్న భూ సర్వే వ్యక్తిగత అంశం కాదన్నారు. సమాజంలో ఒక మార్పు కోసం చేస్తున్న ప్రయత్నం. దీనికి సిబ్బంది అర్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ఒక ఉద్యమంలా రీ సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సైకో ఎవరో చంద్రబాబు మాటలు చూస్తే అర్ధమవుతుంది. ఏం చేయాలో అర్ధం కాక చంద్రబాబు మీడియా పిచ్చెక్కిపోతోంది. ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది రియాలిటీ.
Read ALso: Crime News: డామిట్ కథ అడ్డం తిరిగింది.. మ్యాట్రిమోని మోసగాడి తిక్క కుదిరింది
దీన్ని అందరూ అంగీకరించాల్సిందే. కోవిడ్ లాంటి సంక్షోభం లేకపోతే పరిస్థితి మరో రకంగా ఉండేది. ఇంత ఆర్ధిక సంక్షోభం ఉన్నా…ప్రజా సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కొనసాగించ గలిగారు. అందుకే అందరూ ఇవాళ ధీమా బతకగలుగుతున్నారు. ఉద్యోగులు అర్ధం చేసుకుంటున్నారు. మీడియా అడిగిన ప్రశ్నకు నేను సమైక్య రాష్ట్రం పై సమాధానం ఇచ్చాను. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారనే విమర్శలకే నా సమాధానం అన్నారు.
మేం పారదర్శకంగా, క్లీన్ గా ఉన్నాం. అలాంటి పరిస్థితి వస్తే మా విధానం ఏంటో చెప్పాలి. అదే సమయంలో 8 ఏళ్ళు గడిచిపోయాయి… వెనక్కి వెళ్ళటం సాధ్యం కాదు అని కూడా చెప్పాను. వాలంటీర్ల పై చేస్తున్న విమర్శలను ప్రజల దగ్గరకు వెళ్ళి చెప్పమనండి. పేడ నీళ్ళు ముఖం పై చల్లుతారు. వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు…సమాజ సేవ చేయాలన్న ఆకాంక్ష ఉన్న వాళ్ళే వాలంటీర్లుగా ఉన్నారన్నారు. స్వచ్ఛంద సేవతో చేస్తున్నారు. అది వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడే చెప్పాం. వాలంటీర్లకు ఇస్తున్నది జీతం కాదు గౌరవ వేతనం అన్నారు సజ్జల.
Read Also: Varla Ramaiah: వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం.. సీఈసీకి టీడీపీ కంప్లైంట్