Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: టీడీపీకి చెందిన వ్యక్తి అని ఏ పథకమైనా ఆగిందా?

Sajjala

Sajjala

Sajjala Ramakrishna Reddy: టీడీపీకి చెందిన వ్యక్తి అని ఏ పథకమైనా ఆగిందా, చంద్రబాబును అడుగుతున్నానని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పూర్తి చేసిన అంశాలు, అమలైన పథకాలు వదిలేసి, ఏవేవో మాట్లాడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఏది నష్టం చేసిందో కచ్చితంగా మాట్లాడలేరని.. ఆసుపత్రుల్లో ఓపీలు తగ్గిపోయాయి అని హాస్యాస్పదంగా మాట్లాడతారని విమర్శించారు. చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ అంటే, పెద్ద పెద్ద బిల్డర్లకు ఇసుక ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు. ఉచిత జేసీబీ, క్రేన్ పధకాలు చంద్రబాబు ఏమైనా పెట్టాడా అంటూ సజ్జల ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక ఐతే దెందులూరు ఎమ్మెల్యే ఎందుకు ఎమ్మార్వో జుట్టు పట్టుకున్నాడని ప్రశ్నలు గుప్పించారు.

Read Also: PM Modi: కేసీఆర్ కలిసేందుకు వచ్చినా నేను కలవలేదు.. ఎందుకంటే..

సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ” ప్రజలకు సంబంధం లేని రాజకీయం చేయడం, విషం కక్కడం ఒక అద్భుతంలా చూపే వారిని రాజకీయ వ్యభిచారి అంటాం.. 59 అసెంబ్లీ నియోజకవర్గాలలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. చంద్రబాబు తప్పు చేస్తే లోకేష్ ఏడ్చుకుంటూ ఢిల్లీ వెళ్ళాడు. లోకేష్ ఒక జోకర్… వచ్చాడని జనాలు అనుకుంటున్నారు.చంద్రబాబుకు 175 నియోజకవర్గాలలో అభ్యర్ధులు ఉన్నారా?. మా గృహసారధులు వెళ్ళి ప్రతీ పధకం గురించీ ఇప్పటి వరకూ 30లక్షల ఇళ్ళకు వెళ్ళి తెలుసుకున్నారు. జగన్ చేసినవన్నీ ప్రజలకు తెలుసు కనుకనే వై ఏపీ నీడ్స్ జగన్ అని అడిగి తెలుసుకుంటున్నాం. సోషల్ ఆడిట్ జరుపుతూ, ఏం చేసామో బోర్డులు పెట్టి చెప్పగలుగుతున్నాం” అని సజ్జల తెలిపారు.

Exit mobile version